ఫోను మీది..భద్రత మాది

Wed,January 9, 2019 12:31 AM

special services start Select

- ప్రత్యేక సర్వీసులను ఆరంభించిన సెలెక్ట్
హైదరాబాద్, జనవరి 8: చేతిలోంచి జారిపడిపోయి స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్ పనిచేయడం లేదా! నీళ్లలో పడిపోయి మొత్తం పాడైందా అయితే చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటివారికోసం ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ సెలెక్ట్..ఫోను మీది-భద్రత మాది అనే నినాదంతో సీ సేఫ్ పేరుతో ప్రత్యేక సేవలను ఆరంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై గురు మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా కొత్త మొబైల్ కొనుగోలు చేసి కొన్ని రోజుల్లోనే పాడై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటన్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సేవలను ఆరంభించినట్లు, తద్వారా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ నూతన సేవల్లోభాగంగా కంపెనీ చెందిన రిటైల్ అవుట్‌లెట్లలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలోనే ఏటీఎం మాదిరిగా ఉండే కార్డులను అందించడం జరుగుతున్నది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ కార్డుల్లో పీపీ30 గోల్డ్ కార్డుపై నెల రోజుల పాటు ఎల్‌సీడీ స్క్రీన్‌పై గ్యారెంట్ కల్పించింది.

ఇందుకోసం రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పీపీ180 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన కార్డును తీసుకున్న వారికి వ్యారెంట్‌ని మరో ఏడాది పాటు లభించనున్నది. మొబైల్ భద్రతతోపాటు వ్యారెంట్ పెంచడం, ఎక్సేంజ్ ఆఫర్, మొబైల్ మరమ్మత్తులు అందిస్తున్నట్లు చెప్పారు. ఆయా కంపెనీలు అందిస్తున్న ఏడాది వ్యారెంటీతోపాటు మరో ఏడాది వ్యారెంట్ సదుపాయం కల్పిస్తున్నది. కార్డుతోపాటు యాప్ ద్వారా ఈ సేవలు పొందవచ్చును. ఒకవేల మొబైల్ పాడైతే యాప్ ద్వారా ఈ సేవలు పొందేందుకు వీలుంటుంది. తద్వారా సర్విసింగ్ సెంటర్‌ను వెతుక్కోవాల్సిన అవసరం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

2965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles