హైదరాబాద్‌లో స్లీప్‌వెల్ వరల్డ్

Sun,October 13, 2019 02:27 AM

హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ పరుపుల తయారీదారు స్లీప్‌వెల్.. గచ్చిబౌలీలో తమ కొత్త తరం షోరూంను తెరిచింది. భారతీయ పరుపుల పరిశ్రమలో ఓ నూతన రిటైల్ అనుభూతికి స్లీప్‌వెల్ వరల్డ్ నాంది పలుకుతుందన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో సంస్థ వ్యక్తం చేసింది. క్షణం తీరిక లేని ఈ యాంత్రిక జీవనంలో నిద్రకున్న ప్రాముఖ్యత, ఆరోగ్యానికి దాని అవసరం తదితర అంశాలు కొనుగోలుదారులకు ఈ స్టోర్ సందర్శనతో తెలుస్తాయన్నది. షీలా గ్రూప్‌నకు చెందిన స్లీప్‌వెల్ బ్రాండ్.. దేశీయ ప్రధాన పాలీయురేతేన్ ఫోమ్ తయారీదారు. దేశవ్యాప్తంగా 12 ఉత్పాదక కేంద్రాలు, 100కుపైగా పంపిణీదారులు, 6,500లకుపైగా డీలర్లు దీని సొంతం. ఆటోమొబైల్, షూస్, దుస్తులు, ప్యాకేజింగ్ తదితర రంగాల్లోనూ దీన్ని వాడుతున్నారు.

324
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles