షీలా గౌతమ్ కన్నుమూత

Tue,June 11, 2019 12:31 AM

Sleepwell founder and ex MP Sheela Gautam dead

న్యూఢిల్లీ, జూన్ 10: షీలా గ్రూప్ వ్యవస్థాపకురాలు, గౌరవ చైర్‌పర్సన్ షీలా గౌతమ్ కన్నుమూశారు. ఆమె మరణంపట్ల సంస్థ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ నెల 8న ఆమె మృతి చెందగా, 1971 లో షీలా ఫోమ్‌ను స్థాపించి వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. స్లీప్‌వెల్ బ్రాండ్‌తో షీలా గ్రూప్ పరుపులను విక్రయి స్తున్నది. రాజకీయ నాయకురాలు కూడా అయిన షీలా గౌతమ్.. బీజేపీ తరఫున లోక్‌సభకు వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నిక కావడం గమనార్హం. బుధవారం ఆమె సంతాప సభను ఇక్కడి అశోక్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు గ్రూప్ తెలిపింది. 1931లో స్వా తంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించిన షీలా గౌతమ్.. తన తుదిశ్వాస వరకు సమాజం కోసమే పనిచేశారని పలువురు బీజేపీ నాయకులు కొనియాడారు.

2153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles