ఆగస్టుకల్లా సింగిల్ అథారిటీ

Mon,May 27, 2019 12:06 AM

Single authority for sanctioning processing GST refunds likely by August

- జీఎస్టీ రిఫండ్స్ ప్రాసెసింగ్, మంజూరు కోసం తీసుకురానున్న ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ, మే 26: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిఫండ్స్ ప్రాసెసింగ్, మంజూరు కోసం సింగిల్ అథారిటీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టుకల్లా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతిదారులు జీఎస్టీ రిఫండ్స్ లేక నగదు కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రిఫండ్స్ వ్యవస్థ సరళతరానికి ఆర్థిక శాఖ నడుం బిగించింది. ప్రస్తుతం కేంద్ర, రాష్ర్టాల పన్ను అధికారులతో కూడిన రెండు రకాల రిఫండ్ వ్యవస్థ ఉన్నది. దీంతో దీన్ని ఒక్క తాటిపైకి తెచ్చే దిశగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నది. రిఫండ్ కోసం వచ్చిన క్లెయిములలో సగం సెంట్రల్ ట్యాక్స్ ఆఫీసర్ క్లియర్ చేస్తే.. మరో సగాన్ని రాష్ర్టాలకు చెందిన ట్యాక్స్ ఆఫీసర్లు ఆమోదించాల్సి వస్తున్నది. ఇది ఎగుమతిదారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. అయితే రెవిన్యూ శాఖ తీర్చిదిద్దుతున్న సింగిల్ అథారిటీ వ్యవస్థలో ఒక్కసారి క్లయిమును సంబంధిత అధికారి మంజూరు చేస్తే లబ్దిదారునికి పూర్తిస్థాయిలో రిఫండ్ అందుతుంది.

512
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles