సింగరేణి రికార్డు

Mon,March 11, 2019 11:47 PM

-60 మిలియన్ టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని, నమస్తే తెలంగాణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో మరో 21 రోజులు మిగిలి ఉండగానే 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని దాటి సింగరేణి సంస్థ రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో 62.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈసారి 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి సంస్థ 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా 60.38 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి సంచలనం సృష్టించింది. అప్పట్నుంచి 60 మిలియన్ టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి చేస్తూ.. ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యం లో ఈ నెల 10 నాటికే 6,00,01,689 టన్నుల బొగ్గు ఉత్పత్తి (60.001 మిలియన్ టన్ను లు) సాధించిన సింగరేణి.. ఈ నెల 31లోగా 66 మిలియన్ టన్నుల మార్కును తాకడం సాధ్యమేనని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles