శ్రీరేణుక షుగర్స్‌ లాభం రూ.2,739 కోట్లు

Mon,November 11, 2019 03:33 AM

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: చక్కెర ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన శ్రీ రేణుక షుగర్స్‌ అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ. 2,739 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదేకాలానికిగాను సంస్థ రూ.432.7 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. తొలి త్రైమాసికంలోనూ రూ.411.7 కోట్లు నష్టపోయింది. జూలై-సెప్టెంబర్‌ మధ్యకాలంలో ఆదాయం రూ.1,001 కోట్ల నుంచి రూ.1,413 కోట్ల ఆదాయాన్ని గడించినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.1,330.4 కోట్ల నుంచి రూ.1,636.50 కోట్లకు చేరుకున్నాయి. ఏకీకృత విషయానికి వస్తే గత త్రైమాసికంలో రూ.1,295.10 కోట్ల ఆదాయంపై రూ.36 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.1,237.20 కోట్ల నుంచి రూ.1,531 కోట్లకు చేరాయి.

212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles