ఇండిగోకు పైలెట్ల కొరత

Mon,February 11, 2019 12:30 AM

Shortage of Pilots Compels IndiGo to Cancel 32 Flights Across Country

-32 విమాన సర్వీసుల రద్దు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసుల రద్దు పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే భారీ స్థాయిలో విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ తాజాగా.. పైలెట్లు లేని కారణంగా మరో 32 ైఫ్లెట్లను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. వీటిలో ఢిల్లీ, కొల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి ఇతర నగరాలకు వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయని విమానయాన ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. శనివారం 15 ైఫ్లెట్లను రద్దుచేసిన సంస్థ..ఆదివారం మరో ఏడింటిని నెలపట్టునే ఉంచిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 7న ఉత్తర భారతంలో తీవ్రమైన వడగళ్ల వర్షం కురియడంతో 11 విమా నాలను ఇతర మార్గాలకు మళ్లించింది. ఆదివారం బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 16 సర్వీసులు అర్ధాంత రంగా రైద్దెనట్లు ఆ వర్గాలు తెలిపాయి.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles