డిజిటల్ బాటలో కిరాణా

Mon,May 13, 2019 12:17 AM

Shopfloor modernisation presents new growth avenue for infotech companies

-దేశవ్యాప్తంగా 50 లక్షలకుపైగా దుకాణాలు ఆధునికీకరణ
-రిలయన్స్ రాకతో 2023 నాటికి సాధ్యమే
-బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా

న్యూఢిల్లీ, మే 12: ఆన్‌లైన్ రిటైల్‌లోకి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రాక ప్రస్తుతం 15 వేలుగా ఉన్న డిజిటల్ కిరాణా స్టోర్ల సంఖ్యను 2023 నాటికి 50 లక్షలకుపైగా తీసుకెళ్లగలదని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అధ్యయనం ఒకటి అంచనా వేసింది. ప్రస్తుతం 700 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ రిటైల్ మార్కెట్.. 90 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నది. చాలామంది ఇంటి పక్కనే ఉన్న కిరాణా దుకాణాలకు వెళ్లి కావాల్సిన సరుకులను కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ రాక ఈ దుకాణాలన్నింటినీ డిజిటల్ బాట పట్టించేయనున్నదని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెబుతున్నది. దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా రిటైల్ ఔట్‌లెట్లను కలిగి ఉన్న రిలయన్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్-టు-ఆఫ్‌లైన్ ఈ-కామర్స్ వేదికను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ రిటైల్ విభాగంలోకి వస్తున్నట్లు ఇప్పటికే ముకేశ్ ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలోనే 2023 నాటికి దేశం మొత్తం మీద 50 లక్షలకుపైగా కిరాణా దుకాణాలు ఆధునికీకరించబడుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెబుతున్నది.

జీఎస్టీతో అనివార్యం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ అనివార్యంగా మారిందని, కిరాణా దుకాణాలూ డిజిటల్ బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని బ్యాంక్ ఆఫ్ అమెరికా అభిప్రాయపడింది. ఇరుగుపొరుగు దుకాణాల్లో కొనే నిత్యవసర సరుకులకు బిల్లులు ఉండట్లేదని, దీనివల్ల జీఎస్టీ ఆదాయానికి గండి పడుతున్నదని, కొనుగోలుదారులకూ నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆన్‌లైన్ రిటైల్‌లోకి రిలయన్స్ రాక.. ప్రభుత్వానికీ లాభదాయకమేనని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంటున్నది.

మొబైల్ పీవోఎస్‌లు

కిరాణా దుకాణాల్లో జియో మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) పరికరాలను రిలయన్స్ అందుబాటులో ఉంచాలని చూస్తున్నది. దీనివల్ల జియో వినియోగదారులు తమ ఆర్డర్లను నేరుగా కిరాణా దుకాణాదారులకు చేరవేయవచ్చని, వేగవంతమైన సరఫరాను అందుకోవచ్చని రిలయన్స్ అంటున్నది. కేవలం రూ.3,000 చెల్లిస్తే జియో మొబైల్ పీవోఎస్‌లు పొందవచ్చు. ఇప్పటికే స్నాప్‌బిజ్, నుక్కడ్ షాప్స్, గోఫ్రుగల్.. మొబైల్ పీవోఎస్ సేవలను అందిస్తుండగా, స్నాప్‌బిజ్ రూ.50,000, నుక్కడ్ షాప్స్ రూ.30,000-55,000, గోఫ్రుగల్ రూ.15,000 నుంచి లక్ష రూపాయలదాకా వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చార్జ్ చేస్తున్నాయి. దీంతో జియో మొబైల్ పీవోఎస్‌కు డిమాండ్ బాగానే ఉంటుందన్న అంచనాలు మార్కెట్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా, ముంబై, నవీ-ముంబైల్లోని 15 స్టోర్లను సందర్శించామని, మొబైల్ పీవోఎస్ సేవలు లాభసాటిగానే ఉన్నాయని దుకాణాదారులు చెప్పినట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా వర్గాలు తెలిపాయి.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles