ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులోమరో వికెట్

Sun,April 14, 2019 02:42 AM

SFIO arrests former ILFS Fin Services CEO Ramesh Bawa

-ఫైనాన్షియల్ సర్వీసెస్మాజీ చీఫ్ రమేశ్ బవ అరెస్టు
-అదుపులోకి తీసుకున్న ఎస్‌ఎఫ్‌ఐవో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) కేసులో రెండో అరెస్టు జరిగింది. తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) శనివారం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మాజీ ఎండీ, సీఈవో రమేశ్ సీ బవను అదుపులోకి తీసుకున్నది. బవ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న దానిపై కంపెనీల చట్టంలోని సెక్షన్ 447 కింద ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఎఫ్‌ఐవో వర్గాలు తెలియజేశాయి. ఆయన మోసపూరిత లావాదేవీలకు దిగారన్న ఆరోపణలున్నాయని చెప్పాయి. అర్హత లేని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న సంస్థలకు బవ రుణాలిచ్చారని, దీనివల్ల ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు, దాని రుణదాతలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి.

కాగా, ఈ నెలారంభంలోనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వైస్ చైర్మన్ హరి శంకరణ్‌ను ఎస్‌ఎఫ్‌ఐవో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దేశీయ ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్.. డెట్ ఇన్‌స్ట్రూమెంట్స్, బ్యాంక్ రుణాల ద్వారా దాదాపు రూ.17,500 కోట్ల రుణాలను ఇచ్చింది. ఈ డెట్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ల్లో ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, గ్రాట్యుటీ ఫం డ్స్, మ్యూచువల్ ఫండ్స్‌లతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పెట్టుబడులు పెట్టా యి. గతేడాది రుణ చెల్లింపుల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని పలు సంస్థలు విఫలం కావడంతో ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఎస్‌ఎఫ్‌ఐ వో విచారణకు దిగింది. కాగా, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం ప్రభావం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై పడగా, అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దృష్టి సారించాల్సి వచ్చింది.

787
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles