ఫలితాలపై ఆశావాదం

Sat,April 13, 2019 02:10 AM

Sensex up by 160 points

-160 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై, ఏప్రిల్ 12: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కార్పొరేట్ల ఫలితాలపై మదుపరులు ఆశావాదంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనిశ్చిత పరిస్థితులు మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. ఇంట్రాడేలో 200 పాయింట్లకు పైగా లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 160.10 పాయింట్లు లాభపడి 38,767.11 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల దన్నుత్లో లాభాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 46.75 పాయింట్లు లాభపడి 11,643.45 వద్ద స్థిరపడింది. ఈ వారంలో సెన్సెక్స్ 95.12 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 22.50 పాయింట్లు పతనం చెందింది. ఐటీసీ అత్యధికంగా 3.14 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. మారుతి సుజుకీ, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, వేదాంత, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్‌లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, టాటా మోటర్స్, ఇండస్‌ఇంద్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీలు మాత్రం రెండు శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి. రంగాలవారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఇంధనం, ఆటో, బ్యాంకింగ్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

1841
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles