బిగిసిన భల్లూకం పట్టు

Wed,September 12, 2018 12:42 AM

Sensex sinks 509 points Nifty settles at 11287

-ఎఫ్‌ఐఐల అమ్మకాల ఊపు
- రెండురోజుల్లో సెన్సెక్స్‌కు వెయ్యి పాయింట్లు నష్టం
- రూ. 4.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం
- మార్కెట్‌ను వీడని ట్రేడ్ వార్ భయాలు

స్టాక్ మార్కెట్‌పై భల్లూకం పట్టు బిగుస్తున్నది. ఎఫ్‌ఐఐల అమ్మకాలు ఊపందుకున్నాయి. నిఫ్టీలోని 50 షేర్లలు నిన్నా నేడు పట్టుమని పది షేర్లు కూడా లాభాలు సాధించలేకపోయాయి. వరుసగగా రెండో రోజున కూడా భారీ నష్టాలతో ముగిసింది. రెండురోజుల్లోనే వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారడంతో పాటు గ్లోబల్ ట్రేడ్ వార్ భయాలు ప్రపంచమార్కెట్లను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో మార్కెట్ వరుస పతనాలతో బెంబేలెత్తిస్తున్నది. గత నెలాఖరు నమోదు అయిన జీవిత గరిష్ఠ స్థాయి నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 4 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 509.04 పాయింట్లు నష్టపోయి 37,413.13 స్థాయిలో ముగిసింది, కాగా, నిఫ్టీ 150.60 పాయింట్ల నష్టంతో 11,287.50 వద్ద ముగిసింది. రెండురోజుల్లో రూ. 4.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకు పోయింది. ఆగస్టు రెండోన తర్వాత నిఫ్టీకి ఇదే కనీస స్థాయి. ఈ రోజు రూపాయి మారకం విలుతా తాజా జీవితకాల కనీస స్థాయి రూ. 72.74ను తాకింది. క్రూడాయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో డాలర్లకు డిమాండ్ పెరిగింది.

ఇప్పటివరకూ ఈ ఏడాది రూపాయి విలువ 13 శాతం నష్టపోయింది. దీనికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న వార్తలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు అమెరికాకు తరలివెళ్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఎఫ్‌ఐఐలు ఈ రోజు రూ. 1454.36 కోట్ల అమ్మకాలు జరిపారు. రూపాయి విలువ మరి కొంత పతనం అయ్యే అవకాశం ఉన్నా, తిరిగి కోలుకునే అవకాశాలున్నాయని కార్విబ్రోకింగ్ సీఈవో రాజీవ్‌రంజన్ సింగ్ విశ్లేషించారు. వర్థమాన దేశాల కరెన్సీల పతనం ప్రపంచ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచిందనీ, రూపాయి మారకం విలువన సమీప భవిష్యత్‌లో రూ.73 నుంచి రూ.73.50 వరకు పతనం కావచ్చునని ఆయన అంచనా వేశారు. మరో వైపు గ్లోబల్ ట్రేడ్ వార్ ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికాతో వాణిజ్య వివాదంలో ఆంక్షలు విధించాలంటూ చైనా డబ్యూటీవోను కోరింది.

అలాగే అమెరికా అదనపు సుంకాలకు ప్రతీకారంగా తాము కూడా సుంకాలను విధిస్తామంటూ చైనా ప్రకటించడంతో వాణిజ్య సుంకాల పోరు చిలికి చిలికి గాలివానలా మారే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇదిలావుండగా, క్రూడాయిల్ ధరలు మరింతగా పెరిగాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ చమురు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. మిగతా దేశాలు క్రూడ్ ఉత్పత్తిని పెంచాలంటూ ట్రంప్ చేసిన వినతిని ఎంతవరకు పాటిస్తాయో చూడాలి. క్రూడాయిల్ ధరలు మరింతగా పెరగడం అమెరికాకు ఇష్టంలేదు. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 77.83 డాలర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్‌లతో పాటు దాదాపు అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిసాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ గరిష్టంగా 2.41 శాతం మేర ముగిసింది.

ఆ తర్వాత రియాల్టీ ఇండెక్స్ 1.99 శాతం, మెటల్ ఇండెక్స్ 1.61 శాతం, ఫార్మా ఇండెక్స్ 1.60 శాతం, ఆటో ఇండెక్స్ 1.50 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.45 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 1.34 శాతం, స్మాల్‌క్యాప్-100 ఇండెక్స్ 1.54 శాతం మేర నష్టపోయాయి. కాగా, మార్కెట్ బ్రెడ్త్ సోమవారం కన్నా క్షీణించింది. నిఫ్టీ 50 షేర్లలో కేవలం ఆరు షేర్లే లాభాల్లో ముగిసాయి ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1282 షేర్లు నష్టాల్లో ముగిస్తే కేవలం 468 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. కోల్ ఇండియా 1.72 శాతం లాభపడగా, ఎంఅండ్‌ఎం 1.03 ఎన్‌టీపీసీ 0.53 శాతం,మేర లాభపడ్డాయి. టైటాన్ 4.50 శాతం నష్టపోతే టాటా స్టీల్ 3.94 శాతం, ఐటీసీ 3.38 శాతం, టాటామోటార్స్ 3.25 శాతం చొప్పున నష్టపోయాయి.

టెక్నికల్, 50డీఎంఎ దిగువన మార్కెట్

రెండురోజుల్లో 300 పాయింట్లకు పైగా నష్టపోవడం నిఫ్టీ మధ్యాకాలిక ట్రెండ్ మద్దతు స్థాయి 50 రోజుల చలన సగటుకు దిగువన ముగిసింది. అలాగే 11,300 స్థాయికి దిగువన ముగియడంతో అనేక మద్దతు స్థాయిలను దిగజారిపోయినట్టయింది. ఇండియావిక్స్ ఇండెక్స్ ఏకంగా 15కు పెరిగింది. దీంతో మార్కెట్‌లో మరింతగా నష్టపోవడానికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్వల్ప కాలిక చార్ట్‌లో కొన్ని ప్రధాన ఇండికేటర్లు ఓవర్‌సోల్డ్ పొజీషన్‌కు చేరినందు స్వల్పంగా బౌన్స్ కూడా రావచ్చు.

2042
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles