వారం..వారం..నష్టాలే

Sat,May 11, 2019 04:36 AM

Sensex, Nifty continue losing streak

-1,500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
-433 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

ముంబై, మే 10: మదుపరులకు ఈ వారం నిరాశనే మిగిల్చింది. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు నిరాశావాదంగా ఉండటంతో వరుసగా ఎనిమిదో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పతనాన్ని మూటగట్టుకున్నాయి. ఫిబ్రవరి తర్వాత వరుసగా ఇన్ని రోజుల పాటు పతనమవడం ఇదే తొలిసారి. వారాంతం ట్రేడింగ్ ప్రారంభం నుంచి తీవ్ర ఊగిసలాటలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 95.92 పాయింట్లు దిగవకు పడిపోయి 37,462.99 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22.90 పాయింట్లు తగ్గి 11,278.90 వద్దకు జారుకున్నది. ఈ వారంలో సెన్సెక్స్ 1,500.27 పాయింట్లు లేదా 3.85 శాతం, నిప్టీ 433.35 పాయింట్లు లేదా 3.69 శాతం కోల్పోయాయి. చైనా ఉత్పత్తులపై 200 బిలియన్ డాలర్ల విలువైన పన్నులను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనను పెంచింది. వారాంతం ట్రేడింగ్‌లో టాటా స్టీల్ అత్యధికంగా 6.10 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది. జర్మనీకి చెందిన ఇండస్ట్రీ సంస్థ థైస్సెంక్రూప్ కొనుగోలుకు యూరోపియన్ కమిషన్ ఒప్పుకోకపోవడంతో మార్కెట్లో భారీ పతనానికి కారణమైంది. వీటితోపాటు హెచ్‌సీఎల్ టెక్, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇంద్ బ్యాంక్, టీసీఎస్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, వేదాంత, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్‌ల షేర్లు నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ మాత్రం 2.94 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. అలాగే భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్‌ల షేర్లు బలపడ్డాయి. కార్పొరేట్ల ఫలితాలు నిరాశవాదంగా ఉండటం, ముఖ్యంగా ఆటో, కన్జ్యూమర్, ప్రైవేట్ బ్యాంకుల త్రైమాసిక ఫలితాలల్లో నిస్తేజం, దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపాయని కొటక్ సెక్యూరిటీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ తెలిపారు. రంగాల వారీగా చూస్తే మెటల్, ఐటీ, చమురు అండ్ గ్యాస్, టెక్ రంగాల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించకపోకపోవడంతో ఈ రంగ సూచీలు 1.54 శాతం పడిపోయింది. కానీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, బ్యాంకెక్స్, ఆర్థిక సేవల రంగ షేర్లు రెండు శాతం వరకు బలపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా రెండు పైసలు పెరిగి 69.86 వద్ద ముగిసింది.

కోలుకున్న జెట్ ఎయిర్‌వేస్

జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు బిడ్డింగ్‌ను దాఖలుచేసినట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ ప్రకటించడంతో ఒక్కసారిగా కంపెనీ షేర్లు ఎగువము ఖం పట్టాయి. ఇంట్రాడేలో 6.91 శాతం లా భపడిన కంపెనీ షేరు ధర చివరకు 2.85 శా తం లాభంతో రూ.151.80 వద్ద ముగిసింది.

హెచ్‌సీఎల్ టెక్ 5 శాతం డౌన్

ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేరు ధర భారీగా పడిపోయింది. ఒక దశలో ఐదు శాతానికి పైగా పడిపోయిన కంపెనీ షేరు ధర చివరకు 4.53 శాతం నష్టంతో రూ.1,085.05 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6,24 5.33 కోట్లు తగ్గి రూ.1,47,298.67 కోట్లకు పరిమితమైంది. బీఎస్‌ఈలో 2.07 లక్షల షేర్లు చేతులు మారగా, ఎన్‌ఎస్‌ఈలో 77 లక్షల షేర్లు ఇతరులు కొనుగోలు చేశారు.

783
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles