దలాల్ స్ట్రీట్ ఢమాల్

Tue,July 9, 2019 03:56 AM

Sensex falls 793 pts Nifty ends below 11,600 Bajaj Fin twins top losers

-భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
-సెన్సెక్స్ 793, నిఫ్టీ 252 పాయింట్లు పతనం
-ప్రస్తుత సంవత్సరంలో గరిష్ఠ స్థాయి క్షీణత
-బడ్జెట్ నిర్ణయాలను మెచ్చని మదుపరులు

ముంబై, జూలై 8: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బడ్జెట్ ప్రతిపాదనలపై అసంతృప్తి మధ్య ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా మదుపరులు లాభాల స్వీకరణకే పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఈ ఏడాదిలోనే గరిష్ఠ స్థాయి నష్టాలను చవిచూశాయి. దీంతో మార్కెట్ విలువ కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 792.82 పాయింట్లు లేదా 2.01 శాతం పతనమై 38,720.57 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 252.55 పాయింట్లు లేదా 2.14 శాతం క్షీణించి 11,558.60 వద్ద నిలిచింది. ఒకానొక దశలో సెన్సెక్స్ 908, నిఫ్టీ 259 పాయింట్లు దిగజారాయి. ఆర్థిక, ఆటో, చమురు రంగాల షేర్లలో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను గత శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులపై, అపర కుబేరులపై అధిక పన్నులను బాదడం జరిగింది. అంతేగాక షేర్ బైబ్యాక్‌పై 20 శాతం పన్ను ప్రకటించారు. ఇవి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయిగా, శుక్రవారం సైతం సెన్సెక్స్ 395, నిఫ్టీ 136 పాయింట్ల మేర నష్టపోయిన విషయం తెలిసిందే.

ఆకట్టుకోని ఆటో, ఆర్థిక షేర్లు

ఆటో, ఆర్థిక రంగ షేర్లు మదుపరులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. హీరో మోటోకార్ప్ 5.3 శాతం, మారుతి 5.2 శాతం, టాటా మోటర్స్ 3.4 శాతం, బజాజ్ ఆటో 2 శాతం చొప్పన నష్టపోయాయి. ఎస్‌బీఐ 4.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.84 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.77 శాతం మేర కోల్పోయాయి. చమురు రంగ షేర్లనూ నష్టాలు వెంటాడగా, ఓఎన్జీసీ 5.43 శాతం దిగజారింది. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ 4.3 శాతం పడిపోగా, మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ 0.85 శాతం తగ్గింది.

మైండ్‌ట్రీ, పీఎన్‌బీ షేర్లకు కష్టాలు

సంస్థల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకుతోడు మార్కెట్‌లో చోటుచేసుకున్న విపత్కర పరిణామాలు.. దేశీయ మధ్యశ్రేణి ఐటీ రంగ సంస్థ మైండ్‌ట్రీ, ప్రభుత్వ రంగ ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) షేర్ల ఉసురు తీశాయి. మైండ్‌ట్రీలో మెజారిటీ వాటాను ఎల్‌అండ్‌టీ దక్కించుకున్న నేపథ్యంలో సంస్థ చైర్మన్, సీఈవో రాజీనామాలు మైండ్‌ట్రీ షేర్ విలువను 13 శాతం తగ్గించాయి. బీఎస్‌ఈలో 10.43 శాతం, ఎన్‌ఎస్‌ఈలో 13 శాతం నష్టపోయాయి. ఇక భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ రూ.3,805 కోట్ల మోసం వెలుగు చూసిన నేపథ్యంలో పీఎన్‌బీ షేర్ విలువ కూడా బీఎస్‌ఈలో 10.95 శాతం, ఎన్‌ఎస్‌ఈలో 11.24 శాతం నష్టపోయాయి.

గ్లోబల్ మార్కెట్లు కూడా..

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలూ.. దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని ప్రధాన సూచీలన్నీ నష్టాలకే పరిమితం కావడం.. మదుపరుల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. చైనా సూచీ 2 శాతానికిపైగా పడిపోతే, హాంకాంగ్ సూచీ దాదాపు 2 శాతం, జపాన్ ఒక శాతం నష్టపోయాయి. సింగపూర్, ఫిలిప్పీన్స్, తైవాన్, బ్యాంకాక్, మలేషియా సూచీలూ లాభాలకు నోచుకోలేదు. ఇక ఐరోపా మార్కెట్లలో కీలక స్టాక్ మార్కైట్లెన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు కూడా నష్టపోయాయి. న్యూజీలాండ్, ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లూ పడిపోయాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు బాగుండటం.. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతకున్న అవకాశాలను మింగేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు ప్రధానంగా నష్టాలకు గురయ్యాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఇటీవలి భారీ నష్టాల కారణంగా మార్కెట్‌లో మదుపరుల సంపద రూ.లక్షల కోట్లలో కరిగిపోయింది. సోమవారం సెన్సెక్స్ భీకర పతనం నేపథ్యంలో బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ.3.39 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది. మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో రూ.3,39,192.97 కోట్లు దిగజారి రూ.1,47,96,302.89 కోట్లకు పరిమితమైంది. గత శుక్రవారం కూడా సూచీలు నష్టాలకు గురవగా, ఈ రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.5,61,772.64 కోట్లు కనుమరుగైంది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 షేర్లు నష్టాల పాలైయ్యాయి. అత్యధికంగా బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ 8.18 శాతం, ఓఎన్జీసీ షేర్ విలువ 5.43 శాతం పడిపోయింది.
Sensex1

1074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles