నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Tue,February 12, 2019 01:46 AM

-సెన్సెక్స్ 151 పాయింట్లు పతనం
-అమ్మకాల ఒత్తిడిలో ఆటో రంగ షేర్లు

ముంబై, ఫిబ్రవరి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆరంభం నుంచే నష్టాల్లో కదలాడిన సూచీలు.. చివర్లోనూ అదే రీతిలో స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 151.45 పాయిం ట్లు క్షీణించి 36,395.03 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 54.80 పాయింట్లు కోల్పోయి 10,888.80 వద్ద నిలిచింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభపడినా.. ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడలేదు. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గడంతో నష్టాలు తప్పలేదు. ఆటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, పీఎస్‌యూ, ఇన్‌ఫ్రా, రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్ రంగాల షేర్లూ నష్టాలకే పరిమితమయ్యాయి. షేర్ల వారీగా ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, వేదాంత, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 2.54 శాతం మేర నష్టపోయాయి. ఇక అమెరికా-చైనా వాణిజ్య చర్చల మధ్య ఆసి యా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, కొరియా సూచీలు లాభాలను అందుకోగా, ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభాల్లోనే కదలాడుతున్నాయి.

ఆందోళన వద్దు: అపోలో


కొందరు మార్కెట్ ఆపరేటర్ల వల్లే తమ సంస్థ షేర్ల విలువ పతనమైందని సోమవారం హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఆరోపించింది. మదుపరులు ఆందోళన చెందాల్సిన పని లేదని సంస్థ సీఎఫ్‌వో కృష్ణన్ అఖిలేశ్వరన్ పీటీఐతో అన్నారు. బీఎస్‌ఈలో అపోలో షేర్ విలువ 10.64 శాతం పడిపోయి రూ.1,124.95 వద్ద ఉన్నది. సంస్థ ప్రమోటర్లు మరిన్ని షేర్లను తాకట్టు పెడుతున్నారన్న వార్తల మధ్య ఈ క్షీణత చోటుచేసుకున్నది. ఈ క్రమంలోనే అపోలో ఎంటర్‌ప్రైజెస్ పైవిధంగా స్పందించింది.

724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles