36వేల ఎగువన సెన్సెక్స్

Wed,January 9, 2019 11:37 PM

Sensex crosses 36K  Nifty above 11 000 level  Tata Steel Infosys SBI top gainers

అమెరికా-చైనాల మధ్య వాజిజ్య యుద్ధ వాతావరణానికి ఉపశమనం కలుగవచ్చునన్న అంచనాలు, గ్లోబల్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండడంతో దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 231.98 పాయింట్ల లాభంతో 36,212.91 వద్ద ముగిసింది. దాదాపు 467 పాయింట్ల హెచ్చుతగ్గులకు సెన్సెక్స్ లోనైంది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 10,855.15 వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వెలువడడంతో ఆ షేరు ధర దాదాపు ఒకటిన్నర శాతం లాభంతో ముగిసింది. అలాగే ఇన్ఫోసిస్ బైబ్యాక్, స్పెషల్ డివిడెండ్ వార్తలు, గురువారం నాడు టీసీఎస్ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మార్కెట్‌లో ఆశావహ ధృక్పథంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఐటీ షేర్లకు తోడు ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో ర్యాలీ కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది. ప్రపంచ బ్యాంకు.. ఇండియా జీడీపీ 7.3 శాతం వృద్ధి చెందనున్నట్టు అంచనాలు విడుదల చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. దేశీయ వినియోగంలోనూ పెరుగుదల నమోదు అవుతున్నట్టు వస్తున్న వార్తలు కూడా మార్కెట్‌ను ఉత్సాహపరిచాయి. దీంతో ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.01 శాతం మేర పెరిగింది. కాగా, బ్యాంక్ నిఫ్టీ 0.77శాతం, ఆటో 0.54 శాతం, ఫార్మా 0.47 శాతం , రియల్టీ 0.65 శాతం మేర లాభప డ్డాయి. మెటల్ ఇండెక్స్ 1.16 శాతం, ఇంధనం 0.32 శాతం నష్టాల పాలయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ప్రధాన సూచీలు లాభాలతో ముగిసినా బ్రెడ్త్ మాత్రం నెగటివ్‌గా ఉంది. 1,059 షేర్లు ఎన్‌ఎస్‌ఈలో నష్టాలతో ముగిస్తే..717 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఐఐలు రూ. 276.14 కోట్ల కొనుగోళ్లు జరుపగా, డీఐఐలు రూ.439.67 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

370
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles