మార్కెట్లు మళ్లీ పడ్డాయి..

Thu,May 16, 2019 02:22 AM

Sensex closes 203 points down, Nifty at 11,157

ముంబై, మే 15: స్టాక్ మార్కెట్ల ఒక్కరోజు ర్యాలీకి బ్రేక్‌పడింది. అంతర్జాతీయ వాణిజ్యంపై ఆందోళన మరింత తీవ్రతరమవుతుండటం, ఎన్నికలకు సంబంధించి అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్లు దిగువముఖం పట్టాయి. ప్రారంభం నుంచి చివరి వరకు ఆటు ఇటుగా 500 పాయింట్ల వరకు కదలాడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 203.65 పాయింట్లు లేదా 0.55 శాతం తగ్గి 37,114.88 వద్దకు జారుకున్నది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 65.05 పాయింట్లు కోల్పోయి 11,157 వద్ద ముగిసింది. వరుసగా తొమ్మిది సెషన్లపాటు భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. అయినప్పటికీ ఆ మరుసటి రోజే మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దిగువముఖం పట్టాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. యెస్ బ్యాంక్, టాటా మోటర్స్ షేర్లు అత్యధికంగా నష్టపోవడం మార్కెట్ల పతనాన్ని శాసించాయి. వీటితోపాటు ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, మారుతి, ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్ 4.11 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఐటీసీ, కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు ఒక్కశాతానికి పైగా మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 70 డాలర్ల పైన తచ్చాడుతుండటం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యం పోసిందన్నారు. భగ్గుమన్న చమురు ధరల కారణంగా దేశీయ వాణిజ్య లోటు మరింత ఎగబాకే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles