నేలకు కొట్టిన బంతిలా ఎగిసిన సెన్సెక్స్

Thu,October 11, 2018 02:25 AM

Sensex climbs 461 points to 34761 and Nifty surges 159 points to 10460

-పెరిగిన బ్యాంకింగ్ , ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు.. ఐటీ షేర్లకు నష్టాలు
-ఆగని ఎఫ్‌ఐఐల అమ్మకాలు

మార్కెట్లు భారీగా బౌన్స్ అయ్యాయి. ఆరునెలల కనీస స్థాయిల నుంచి రిలీఫ్ ర్యాలీ వచ్చింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆటో, మెటల్ షేర్ల భారీ లాభాలతో ప్రధాన సూచీలు ఒకటిన్నర శాతం మేర లాభంతో ముగిశాయి. సెన్సెక్స్ 461.42 పాయింట్ల లాభంతో 34,760.89 వద్ద ముగియగా, నిఫ్టీ 159.01 పాయింట్ల లాభంతో 10,460.10 వద్ద ముగిసింది. లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా మూమెంటమ్‌ను కొనసాగించాయి. బ్యాంకింగ్, ఆర్థికసేవల షేర్లు మధ్యాహ్నం తర్వాత పుంజుకున్నాయి. ఇటీవల భారీగా నష్టపోయిన షేర్లన్నీ ఈ రోజు భారీ లాభాలతో ముగిశాయి. ఎన్‌బీఎఫ్‌సీలను ఆదుకోవడానికి ఎస్‌బీఐ లిక్విడిటీ అందించనున్నట్టు ప్రకటించడంతో ఈ రంగ షేర్లుకూడా లాభాలతోనే ముగిశాయి. గురువారం టీసీఎస్ ఫలితాలను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఐటీ రంగ షేర్లు మాత్రం నష్టాల్లో ముగిశాయి. ఫార్మా షేర్లలో కూడా ర్యాలీ వచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఇండెక్స్ గరిష్ఠంగా 5.58 శాతం లాభపడింది. రియల్టీ ఇండెక్స్ 4.20 శాతం, మీడియా 5.5 శాతం, ఆర్థికసేవల రంగం 3.44 శాతం చొప్పున లాభపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 4 శాతంపైగా లాభాలతో ముగిశాయి.

ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1,530 షేర్లు లాభాలతో ముగిశాయి. కాగా, కేవలం 313 షేర్లు మాత్రమే నష్టాల పాలయ్యాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 10.15 శాతం లాభపడగా, బజాజ్ ఫైనాన్స్ 9.52 శాతం, జీ ఎంటర్‌టైన్‌మెంట్ 7.44 శాతం, ఐషర్ మోటార్స్ 7.37 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.50 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, ఇన్‌ఫ్రాటెల్ 2.93 శాతం, ఇన్ఫోసిస్ 2.42 శాతం, టీసీఎస్ 2.29 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.64 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, ఈ రోజు కూడా ఎఫ్‌ఐఐలు రూ. 1,096.05 కోట్ల అమ్మకాలు జరపగా, డీఐఐలు రూ.1,892.94 కోట్ల కొనుగోళ్లు జరిపారు. టెక్నికల్‌గా ఓవర్ సోల్డ్‌నుంచి బయటపడేందుకు వచ్చిన ర్యాలీగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి మారకం విలువ స్వల్పంగా కోలుకోవడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్థిరంగా ట్రేడ్ అవుతుండడంతో సెంటిమెంట్ కాస్త మెరుగుపడింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ద్వితీయ త్రైమాసిక ఫలితాల వెల్లడి ప్రారంభం కావడంతో ఇకనుంచి మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయి.

గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేర్ల లిస్టింగ్

ఇటీవల పబ్లిక్ ఇష్యూకు వచ్చిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేర్ల లిస్టింగ్ పేలవంగా జరిగింది. తొలి రోజునే ఆఫర్ ధర రూ. 118 కన్నా 12.5 శాతం తక్కువగా రూ. 105.0 వద్ద ముగిసింది. కాగా, ఎన్‌ఎస్‌ఈలో కడా 12.45 శాతం నష్టంతో రూ. 103.3 వద్ద ముగిసింది. ఐపీవో ద్వారా రూ. 345 కోట్ల నిధులను సమీకరించింది.

రూ. 3 లక్షల కోట్ల సంపద రికవరీ

మార్కెట్‌లో బుధవారం వచ్చిన రిలీఫ్ ర్యాలీలో దాదాపు రూ. 3.08 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద రికవరీ అయింది. గత నెల రోజులుగా వస్తున్న పతనంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపద హరించుకుపోయిన సంగతి తెలిసిందే. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,08,467 కోట్ల కోలుకుని రూ. 1,38,39,750కోట్లకు చేరుకుంది.

3068
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS