ఆమ్రపాలి డైరెక్టర్లకు కోర్టు ధిక్కార నోటీసులు

Thu,October 11, 2018 11:36 PM

SC sends Amrapali CMD directors to police custody

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఆమ్రపాలి గ్రూప్ డైరెక్టర్లకు సుప్రీం కోర్టు గురువారం కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేసింది. గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మతోపాటు డైరెక్టర్లు శివ్ ప్రియా, అజయ్ కుమార్‌లకు యూయూ లలిత్, డీవై చంద్రచుద్‌లతో కూడిన ధర్మాసనం ఈ నోటీసులను ఇచ్చింది. గతంలో తామిచ్చిన వివిధ ఆదేశాలను పట్టించుకోలేదన్న అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా, గ్రూప్‌లోని 46 సంస్థల డాక్యుమెంట్లను సమీకరించాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆదేశించిన కోర్టు.. వచ్చే పదిహేను రాత్రులు ఈ ముగ్గురు డైరెక్టర్లను పోలీస్ లాకప్‌కు బదులుగా హోటల్ పార్క్ అసెంట్‌లో ఉంచాలని సూచించింది. వీరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవాలన్నది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు హోటల్‌లో ఉండాలన్న కోర్టు.. శుక్రవారం నుంచి ఉదయం 8 గంటల్లోగా నోయిడా సెక్టార్ 62 ఎస్‌హెచ్‌వో ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles