26న ఎస్‌బీఐ ఎన్‌పీఏల వేలం

Wed,March 13, 2019 01:35 AM

SBI to auction Rs 2,338 crore of NPAs on March 26

-విక్రయానికి రూ.2,338 కోట్ల మొండి బకాయిలు

ముంబై, మార్చి 12: ప్రభుత్వ రంగ బ్యాం కింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. ఈ నెల 26న రూ.2,337.88 కోట్ల విలువైన ఆరు మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ను వేలం వేయనున్నది. ఆసక్తిగల బ్యాంకులు, ఏఆర్‌సీలు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థలు పాల్గొనవచ్చని మంగళవారం తమ వెబ్‌సైట్‌లో ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కాగా, అమ్మకానికి పెడుతున్న ఎన్‌పీఏల్లో ఇండియన్ స్టీల్ కార్పొరేషన్ (రూ.928. 88 కోట్లు), జై బాలాజీ ఇండస్ట్రీస్ (రూ.859.33 కోట్లు), కోహినూర్ ప్లానెట్ కన్‌స్ట్రక్షన్ (రూ.207.77 కోట్లు), మిట్టల్ కార్ప్ (రూ.116.34 కోట్లు), ఎంసీఎల్ గ్లోబల్ స్టీల్ (రూ.100.18 కోట్లు), శ్రీ వైష్ణవ్ ఇస్పాత్ (రూ.82.52 కోట్లు), గతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ.42.86 కోట్లు) ఉన్నాయి. ఇందులో మిట్టల్ కా ర్ప్, శ్రీ వైష్ణవ్ ఎన్‌పీఏలు మినహా మిగతావాటిని స్విస్ చాలెంజ్ పద్ధతి కింద వేలం వేస్తామని ఎస్‌బీఐ తెలిపింది.

927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles