ఎస్‌బీఐ లాభం డబుల్

Sat,May 20, 2017 12:06 AM

SBI profit double

arundathi
-క్యూ4లో రూ.2,815 కోట్లుగా నమోదుl తగ్గుముఖం పట్టిన మొండి బకాయిలు
న్యూఢిల్లీ, మే 19: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాం కింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకుమించి నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి రూ.2,814.82 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి బ్యాంక్ రూ.1,263.81 కోట్ల లాభాన్ని గడించింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 13 శాతం పెరిగి రూ.16,026 కోట్లుగా నమోదైంది. ఏకాకిగా ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇదే చివరిసారని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పడం హాస్యస్పదమవుతుందని, విలీనం తర్వాత ఎలా ఉంటుందో అంచనావేయడం కష్టతరమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకింగ్ చరిత్రలో తొలిసారిగా ఏడు మార్గాల్లో విలీనం జరిగిందని ఆర్థిక ఫలితాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టాచార్య వెల్లడించారు. సోలోగా(ఏకాకి) ఎస్‌బీఐ అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభాలపై ఒత్తిడి నెలకొనే అవకాశం ఉందన్నారు.

మార్చి 31 నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.20,44,751 కోట్లుగా నమోదవగా, అడ్వాన్స్‌లు రూ.16,27,273 కోట్ల స్థాయిలో ఉన్నాయి. నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టాయని, అయినప్పటికీ టెలికం రంగానికి ఇచ్చిన రుణాలపై భట్టాచార్య ఆందోళన వ్యక్తంచేశారు. ఏకీకృత విషయానికి వస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 5.36 శాతం పెరిగి రూ.10,484 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.40 శాతం నుంచి 9.04 శాతానికి పెరుగగా, నికర ఎన్‌పీఏ 3.73 శాతం నుంచి 5.15 శాతానికి చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 17.33 శాతం పెరిగి రూ.15,401 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) స్వల్పంగా తగ్గి 2.84 శాతానికి పరిమితమైందన్నారు. ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా పెరిగిన బ్యాంక్ షేరు ధర మార్కెట్ ముగిసే సమయానికి 1.72 శాతం లాభపడి రూ.308.15 వద్ద స్థిరపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,348.25 కోట్లు పెరిగి రూ.2,49,905.25 వద్ద స్థిరపడింది.

308

More News

VIRAL NEWS