స్వల్పంగా తగ్గిన ఎస్‌బీఐ వడ్డీరేటు

Sat,February 9, 2019 12:15 AM

SBI lowers base rate

ముంబై, ఫిబ్రవరి 8: రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించిన మరుసటిరోజే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ.30 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్రవ్య పరపతి సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ కీల క వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ.30 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీని తగ్గించినట్లు బ్యాంక్ చైర్మన్ రజనీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తగ్గించిన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో బలహీన, మధ్యస్థాయి వర్గాలకు ఊరట లభించనున్నదన్నారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గరిష్ఠ స్థాయిలో ఉన్న బ్యాంకుల డిపాజిట్ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

1005
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles