ఎస్బీఐ రుణాలు మరింత చౌక

Sat,November 9, 2019 02:19 AM

-5 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
-డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్లు కోత
ముంబై, నవంబర్ 8: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరోసారి ఖాతాదారులకు ఊరట కల్పించింది. అన్ని రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. నూతన రేట్లు ఈ నెల 10 నుంచి అమలులోకి రానున్నాయి. వీటితోపాటు డిపాజిట్లపై వడ్డీరేట్లను కూడా 15 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను తగ్గించడం ఇది ఏడోసారి కావడం విశేషం. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8 శాతానికి తగ్గనున్నదని బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్కెట్లో నిధుల లభ్యతను పెంచడానికి టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లలో కోత విధించింది బ్యాంక్. ఈ రేట్లు కూడా సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఏడాది నుంచి రెండేండ్ల లోపు కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్..బల్క్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 30 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించింది.

379
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles