సొంతింటికి ఎస్‌బీఐ డెస్టినేషన్

Wed,June 12, 2019 01:17 AM

SBI Destination for Own House

హైదరాబాద్, జూన్ 11: ఇండ్ల కొనుగోలుదారుల కోసం డెస్టినేషన్: దీ హోం షాపీ పేరుతో ఎస్‌బీఐ ఓ సరికొత్త నిర్మాణ రంగ ఆధారిత మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైటెక్ సిటీలోని ఐకియా దగ్గర్లో ఏర్పాటైన ఈ హోం షాపీలో ఎస్‌బీఐ ఆమోదం పొందిన, ప్రముఖ డెవలపర్లు చేపట్టిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులపై డిజిటల్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ జే స్వామినాథన్ దీన్ని ప్రారంభించగా, హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా, ఇతర సీనియర్ అధికారులతోపాటు క్రెడాయ్, ట్రెడా, టీబీజీ తదితర పరిశ్రమ సంఘాలు కార్యక్రమానికి హాజరైనట్లు మంగళవారం ఓ ప్రకటనలో ఎస్‌బీఐ తెలిపింది.

1235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles