రుణాలు మరింత చౌక

Wed,July 10, 2019 02:57 AM

SBI cuts lending rates by 5 bps as RBI Governor calls for faster transmission of rate cuts


రుణాలు మరింత చౌక

వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఎస్‌బీఐ

ముంబై, జూలై 9: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. 5 బేసిస్ పాయింట్ల మేర అన్నింటిపైనా దించుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్త వడ్డీరేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో గృహ, వాహన తదితర రుణాలపై ఖాతాదారులకు భారం తగ్గనున్నది. ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను తాము తగ్గిస్తున్నా.. బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని ఆశించిన స్థాయిలో ఖాతాదారులకు అందివ్వడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడు సమీక్షల్లో రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించామని గుర్తుచేశారు. ఈ క్రమంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం వెలువడింది. ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) లేదా కనీస రుణ రేటును 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. అన్ని రుణాలకు ఈ ఎంసీఎల్‌ఆరే అనుసంధానంగా ఉంటున్నది. ఇక ఈ నెల 1 నుంచి రెపో ఆధారిత గృహ రుణాలనూ ఎస్‌బీఐ అందుబాటులోకి తీసుకురాగా, ఆర్బీఐ వరుస కోతల నడుమ 20 బేసిస్ పాయింట్ల మేర గృహ రుణాల వడ్డీరేట్లను తగ్గించింది.

2195
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles