Telangana Intermediate 1st & 2nd Year Results 2019

చేతులు మారనున్న జెట్!

Thu,March 21, 2019 01:58 AM

SBI boss Rajnish Kumar insists bankruptcy last option for Jet Airways

-అనివార్యమని అభిప్రాయపడుతున్న బ్యాంకర్లు
న్యూఢిల్లీ, మార్చి 20: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్..చేతులు మారుతుందా! ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి బయటపడాలంటే యాజమాన్యం మారాల్సిన అవసరం ఎంతై నా ఉన్నదని సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాం కులు అభిప్రాయపడుతున్నాయి. ఈ దిశగా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్టియం చర్యలను వేగవంతం చేసింది. ఒకవేళ జెట్ ఎయిర్‌వేస్ మూతపడితే నరేంద్ర మోదీ సర్కార్‌కు ఇబ్బందులు తప్పవన్న వార్తలు గుప్పుమనడంతో కేంద్రం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. దీంట్లోభాగంగా ఎస్‌బీఐ చీఫ్ రజనీష్ కుమా ర్ బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది.

ఈ సమావేశానికి పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి నృపేందర్ మిశ్రా కూడా హాజరయ్యారు. కంపెనీకి చెందిన మూడోవంతు విమానాలు మాత్రమే నడుస్తుండటం, మరోవైపు వడ్డీలు చెల్లింపుల్లో విఫలమవడం, పైలెట్ల వేతనాలు ఆలస్యమవడం దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు రజనీష్ కుమార్ తెలిపారు. జెట్ ఎయిర్‌వేస్ కొనుగోలుపై ఆసక్తి చూపే సంస్థలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు, దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ ప్రస్తుతం అప్పుల నుంచి గట్టెక్కించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు, చివరి ఆప్షన్‌గా దివాలా ప్రాసెసింగ్ అని ఆయన చెప్పారు. ఒకవేళ ఈ విమానయాన సంస్థ మూతపడితే 23 వేల మంది సిబ్బంది రోడ్డుమీద పడే అవకాశం ఉన్నది.

సంస్థను పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తీసుకునే చర్యలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌లో సంస్థ నడిచే అవకాశాలు లేకపోవడంతో ఇక నూతన మేనేజ్‌మెంట్ అప్పగించాలనే ప్రతిపాదన కూడా దీంట్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్‌కు 51 శాతం వాటా ఉండగా, అబుదాబీకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు 24 శాతం వాటా ఉన్నది. ఈ వాటాను కూడా విక్రయించడానికి ఎతిహాద్ సిద్దమైంది. ఎవరైన కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారా అని అడిగిన ప్రశ్నకు కుమార్ స్పంది స్తూ..పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వీటిలో ఎతిహాద్ కూడా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. అందరికి ఆమోదయోగ్యమైన తర్వాతనే కీలక నిర్ణయం తీసుకుంటామని, ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఒక ప్రొఫెషనల్ మేనేజింగ్ చేసే సంస్థకు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. జెట్ ఎయిర్‌వేస్ విమానాలు నిరాటంకంగా గాలిలో ఎగురాలని రుణాలు ఇచ్చిన బ్యాంకులు, దేశం, విమానయాన రంగం కోరుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం 41 విమానాలను నడుపుతున్న సంస్థ..వచ్చే వారంలో మరిన్ని విమానాలు నిలిచిపోయే అవకాశం ఉన్నదని పౌర విమానయాన నియంత్రణ మండలి(డీజీసీఏ) వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో 119 విమానాలు నడిపిన సంస్థ ప్రస్తుతం వీటిలో మూడోవంతు నడుపడం లేదు.

ఎయిర్‌పోర్ట్ స్లాట్లు మరో సంస్థకు..

జెట్ ఎయిర్‌వేస్ దేశీయంగా వాడని ఎయిర్‌పోర్ట్‌ల స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నగదు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జెట్..లీజుకు సంబంధించిన చెల్లింపులు జరుపకపోవడంతో 47 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మిగతా విమా నాలు కూడా ఇతర కారణాల వల్ల రద్దు చేసుకున్నది సంస్థ. జెట్ ఎయిర్‌వేస్‌తోపాటు ఇతర సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై పౌర విమానయాన వర్గాలు బుధవారం సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, గోఎయిర్, ఇండిగో కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే నెల చివరి నాటికి మరో 20 నుంచి 25 విమాన సర్వీసులు జతకానున్నట్లు ఖరోలా పేర్కొన్నారు.

పతనం అంచున జెట్: పైలెట్లు

జెట్ ఎయిర్‌వేస్ పతనం అంచున ఉన్నదని పైలెట్ల యూనియన్లు ఆందోళన వ్యక్తంచేశాయి. వేతనాలు చెల్లింపులు జరుపడంలో విఫలం కావడంతో సంస్థపై పలు అనుమానాలు కలుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో పైలెట్ల ఉద్యోగ సంఘం నేషనల్ ఏవియేటర్ గిల్డ్(ఎన్‌ఏజీ) పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని, దీంతో ఎంతోమంది రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించిన పైలెట్లు.. ఒకవేళ మూతపడితే విమాన టిక్కెట్లు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. గడిచిన మూడు నెలలుగా పైలెట్లు, ఇంజినీర్లకు జీతభత్యాలు చెల్లించాల్సి ఉన్నది.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles