రూ.1,40,818

Fri,February 22, 2019 01:24 AM

Samsung Unfolds the Future with a Whole New Mobile Category

-ఇదీ.. గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ధర
-మార్కెట్‌లోకి సరికొత్త సామ్‌సంగ్ మొబైల్స్
-త్వరలో తొలి 5జీ హ్యాండ్‌సెట్

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 21: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కాస్త వెనుకబడ్డ సామ్‌సంగ్.. మళ్లీ విజృంభించింది. తమ ఎవర్‌గ్రీన్ బ్రాండ్ గెలాక్సీలో సరికొత్త హంగులతో నేటి యువతరాన్ని ఆకట్టుకునేలా స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇయర్‌ఫోన్లను పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1.40 లక్షలపైనే. మడతబెడితే స్మార్ట్‌ఫోన్.. తెరిస్తే టాబ్లెట్‌గా మారుతుందిది. దీంతో ఈ తరహా ఫీచర్‌తో మార్కెట్‌లోకి ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఘనతను తొలుత సామ్‌సంగే దక్కించుకున్నైట్లెంది. అంతేగాక తొలి 5జీ మొబైల్‌నూ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఇక్కడ సామ్‌సంగ్ కొత్త ఉత్పత్తుల ప్రారంభ వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది. కాగా, 5జీ మొబైల్ ధర, ప్రారంభ తేదీలను సామ్‌సంగ్ ఈ కార్యక్రమంలో ప్రకటించలేదు. అయితే వచ్చే వారం జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈ తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రకటన ఉండవచ్చని అంచనాలున్నాయి. ఇకపోతే గెలాక్సీ శ్రేణిలో వచ్చిన ఈ మొబైల్స్‌ల్లో గరిష్ఠంగా 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలుండగా, 10 మెగాపిక్సల్ ప్రంట్ కెమెరాలుండటం విశేషం. వీటిని 10ఎక్స్ డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అంతేగాక ఈ ఫోన్లు ప్రపంచంలోనే తొలి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో పరిచయమయ్యాయి. శుక్రవారం నుంచి ఫ్లిప్‌కార్ట్, సామ్‌సంగ్ ఈ-స్టోర్‌లలో ముందస్తు బుకింగ్స్ అందుబాటులో ఉండనున్నాయి.

గెలాక్సీ వాచీలు..


గ్లోబల్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన సామ్‌సంగ్.. ఇటీవలికాలంలో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనివ్వలేకపోతున్నది. నిన్నమొన్న వచ్చి న కొత్తకొత్త సంస్థలనూ ఎదుర్కోలేకపోతున్నది. ఈ క్రమంలో కండ్లు చెదిరే స్మార్ట్ ఉత్పత్తులతో వచ్చిన ఈ దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం.. మార్కెట్‌లో అగ్రశ్రేణి సంస్థ యాపిల్‌తోపాటు అన్నింటికీ ధీటైన జవాబిచ్చేలా స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ వాచీలను ముందుకు తెచ్చింది. 199 డాలర్ల (రూ.14,153) ప్రారంభ ధరతో గెలాక్సీ వాచ్ యాక్టీవ్‌ను, 99 డాలర్ల (రూ.7,041) ఆరంభ ధరతో గెలాక్సీ ఫిట్‌ను ప్రవేశపెట్టింది. అలాగే గెలాక్సీ బడ్స్ ఇయర్‌ఫో న్స్‌ను పరిచయం చేసింది. వీటి ప్రారంభ ధర 129 డాలర్లు (రూ.9,175). స్మార్ట్ మార్కెట్‌లో కొత్తదనాన్ని కోరుకుంటున్న వారికోసం.. సా మ్‌సంగ్ సరికొత్త ఉత్పత్తులను తీసుకొచ్చింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన గెలాక్సీ ఫోల్డ్‌లో ఒకేసారి వీడియోలను వీక్షిస్తూ, ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ, ట్రావెల్ ఆప్షన్లను బ్రౌజింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం అని సామ్‌సంగ్ స్పష్టం చేసింది.
s2

గెలాక్సీ ఎస్10ఈ


ప్రారంభ ధర రూ.53,269
5.8 అంగుళాల స్కీన్
6/8 జీబీ ర్యామ్
128/512 జీబీ స్టోరేజీ సామర్థ్యం
12, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
3,100 మెగాహెట్జ్ బ్యాటరీ
మార్చి 8 నుంచి అందుబాటులోకి
s5

గెలాక్సీ ఎస్10


ప్రారంభ ధర రూ.64,000
6.1 అంగుళాల స్క్రీన్
8 జీబీ ర్యామ్
128/512 జీబీ స్టోరేజీ సామర్థ్యం
12, 12, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
3,400 మెగాహెట్జ్ బ్యాటరీ
మార్చి 8 నుంచి అందుబాటులోకి
s10

గెలాక్సీ ఎస్10ప్లస్


ప్రారంభ ధర రూ.71,049
6.4 అంగుళాల స్క్రీన్
8/12 జీబీ ర్యామ్
128/512 జీబీ, 1 టీబీ స్టోరేజీ
12, 12, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
8, 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
4,100 మెగాహెట్జ్ బ్యాటరీ
మార్చి 8 నుంచి అందుబాటులోకి
s11

గెలాక్సీ ఎస్10 5జీ


ధర ప్రకటించలేదు
6.7 అంగుళాల స్క్రీన్
8 జీబీ ర్యామ్
256 జీబీ స్టోరేజీ సామర్థ్యం
12, 12, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
4,500 మెగాహెట్జ్ బ్యాటరీ
విడుదల తేదీ ఖరారు కాలేదు

గెలాక్సీ ఫోల్డ్


ప్రారంభ ధర రూ.1,40,818
మడతబెడితే 4.6 అంగుళాల స్క్రీన్
తెరిస్తే 7.3 అంగుళాల టాబ్లెట్
12 జీబీ ర్యామ్
512 జీబీ స్టోరేజీ సామర్థ్యం
12, 12, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
8, 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
4,380 మెగాహెట్జ్ బ్యాటరీ
ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి

2156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles