సామ్‌సంగ్ ఓపెరా హౌజ్

Wed,September 12, 2018 12:29 AM

Samsung opens world s biggest store in Bengaluru

-బెంగళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను బెంగళూరులో సామ్‌సంగ్ మంగళవారం ప్రారంభించింది. బ్రిటీష్ కాలం నాడు ఒపెరా హౌజ్‌ను లీజుకు తీసుకుని అత్యాధునిక హంగులతో పునరుద్ధిరించిన సామ్‌సంగ్ తన ఉత్పత్తులన్నింటినీ ఒకే చోట్ లభించేలా చేయడంతో పాటు ఆ ఉత్పత్తులను పనితీరును పరిశీలించి, వాటి అనుభూతిని పొంది తనకు కావాల్సిన విధంగా రూపొందించుకునే అవకాశాన్ని ఈ ఎక్స్‌పీరియన్స్ జోన్ అందిస్తున్నది. అన్ని వయస్సుల వారిని ఆకర్షించే విధంగా రూపొందించి ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రపంచంలో ఎక్కడాలేని ఫీచర్లతో రూపొందించినట్టు సామ్‌సంగ్ నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సీఈవో హెచ్‌సీ హాంగ్ తెలిపారు. ఈ ఓపెరా హౌజ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో వర్క్‌షాప్‌లను, యాక్టివీటీలు, వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రెండు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన తాము , ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా ఇండియాపై తమకు ఉన్న నిబద్ధత వెల్లడి అవుతుందన్నారు.

ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దేశంలో దాదాపు రూ. 5,000 కోట్ల పెట్టుబడులను పెట్టినట్టు ఆయన వెల్లడించారు. ఈ సామ్‌సంగ్ ఓపెరా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో స్మార్ట్‌ఫోన్ల రేంజ్, వాటి యాక్సెసరిస్, స్మార్ట్ టీవీలు, క్యూఎల్‌ఈడీ టీవీలు, హోమ్ థియేటర్ సిస్టమ్స్, ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ మైక్రోవెన్స్ ఇలా సమస్థ సామ్‌సంగ్ ఉత్పత్తుల సమాహారాన్ని ప్రదర్శించనున్నారు. హోమ్ అప్లయెన్సెస్ జోన్, గేమింగ్ జోన్‌లలో కుకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను, గేమింగ్ అనుభూతులను స్వయంగా పొందవచ్చు. వర్చువల్ రియాల్టీ, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అనేక అంశాలను ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌లో పొందుపరిచారు. ఫిట్‌నెస్, గేమింగ్, మ్యూజిక్, ఫోటోగ్రఫి, స్టాండ్ అప్ కామెడీ, టెక్నాలజీ స్టార్టప్ వంటి కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ప్లాజా ఏరియాను ఏర్పాటు చేశారు. అతి పెద్ద ఎల్‌ఈడీ స్కీన్, డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో పెద్ద స్టేజీని ఈవెంట్స్ కోసం ఏర్పాటు చేశారు. బెంగళూరులో దేశంలోనే తొలిసారిగా 1996 లో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 2,100 బ్రాండెడ్ స్టోర్స్‌ను, 1,80,000 రిటైల్ పార్ట్‌నర్స్‌తో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కలిగి వుంది.
-బిజినెస్ బూర్యో

970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles