మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 8

Wed,September 13, 2017 12:54 AM

Samsung Galaxy Note 8 launched at Rs 67 900 Specs features and everything to know

ధర రూ.67,900
SAMSUNG
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ సామ్‌సంగ్..దేశీయ మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 8ను ప్రవేశపెట్టింది. ఈ నెల 21 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధరను రూ.67,900గా నిర్ణయించింది. 6.3 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ(256 జీబీ వరకు పెంచుకోవచ్చును), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ స్క్రీన్‌పై ఏడాదిపాటు వ్యారెంట్ సదుపాయం కల్పించింది. ముందస్తు బుకింగ్‌ను మంగళవారం నుంచి ప్రారంభించినట్లు కంపెనీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వార్సి తెలిపారు. ప్రీమియం సెగ్మెంట్‌లో 68 శాతం వాటా కలిగిన సంస్థకు ఈ నూతన మొబైల్‌తో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌కోసం 2.50 లక్షల మంది సోషల్ మీడియాలో ఆసక్తి కనబరిచారన్నారు.

405

More News

VIRAL NEWS