హైదరాబాద్‌లో నోట్ సందడి

Fri,August 23, 2019 12:21 AM

Samsung Galaxy Note 10 launch event In Hyderabad

హైదరాబాద్, ఆగస్టు 22: హైదరాబాద్ గెలాక్సీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న నోట్ 10 ఫ్యాబ్లెట్ గురువారం ఉదయం వారి చెంతకు చేరింది. నగరంలోని పంజాగుట్ట సమీర్ కమ్యూనికేషన్స్‌లో ఈ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సామ్‌సంగ్ దక్షిణాసియా విభాగాధిపతి ఎస్‌బీ కిమ్.. ముందస్తు గా బుక్ చేసుకున్న వినియోగదారులకు ఫోన్ల ను అందజేశారు. షోరూమ్ అధినేత సమీర్ మహ్మద్, కిమ్‌కు సాదరంగా స్వాగతం పలికి, తమ ముఖ్యమైన కస్టమర్లను ఆయనకు పరిచయం చేశారు. తొలి నుంచీ సామ్‌సంగ్ ఫోన్ల విక్రయంలో అగ్రభాగాన ఉన్న సమీర్ కమ్యూనికేషన్స్‌ను సందర్శించాలని తనకు ఎప్పట్నుంచో ఉందని, మార్కెట్లో శుక్రవారం విడుదల అవుతున్నప్పటికీ ఒకరోజు ముందుగానే హైదరాబాద్‌లో విడుదల చేయడం తనకు గర్వకారణమని కిమ్ తెలిపారు. సామ్‌సంగ్‌కు భారత్ ప్రియమైన దేశమని చెప్పిన ఆయన ఇక్కడ తమకు ఎన్నో కార్యాలయాలున్నాయ ని, తమకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పరిశోధన, అభివృద్ధి కేంద్రం కూడా బెంగళూరులోనే ఉందన్నారు. నోట్ 10 పూర్తిగా భారత్‌లోనే తయారైందని, దీని సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో నూ భారత భాగస్వామ్యం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌తో తాము ఇక్కడ తయారు చేసిన ఫోన్లను ప్రపంచమంతా ఎగుమతి చేస్తున్నామని కిమ్ తెలిపారు. బెంగళూరు పరిశోధనా కేంద్రం నుంచి వెలువడిన సాఫ్ట్‌వేర్ మాడ్యూల్స్‌ను మొదటిసారిగా నోట్ 10లో వాడామని, దేశీయ ఇంజనీర్లు అద్భుత ప్రతిభ కలిగినవారని కిమ్ కొనియాడారు. మున్ముందు తమ పరిశోధనా కేంద్రం నుండి అద్భుతాలు జరుగనున్నాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles