ఎస్‌అండ్‌పీ రెండో సెంటర్

Fri,July 12, 2019 02:31 AM

S and P Global opens new facility in Hyderabad adds 700 employees

750 మందికి ఉపాధి.. రెండు నెలల్లో మరో 100 మందికి
కంపెనీ దేశీయ ఎండీ అభిషేక్ తోమర్ వెల్లడిహైదరాబాద్, జూలై 11:రాష్ర్టానికి అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు గ్లోబల్ సంస్థలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేయగా..తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ..భాగ్యనగరంలో తన రెండో ఆఫీస్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ భారత కార్యకలాపాల ఎండీ అభిషేక్ తోమర్ మాట్లాడుతూ..నూతనంగా ఏర్పాటు చేసిన సెంటర్‌లో 850 మంది సిబ్బంది కూర్చోవడానికి వీలుండగా, ఇప్పటికే 750 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు, మరో రెండు నుంచి మూడు నెలల్లో మిగతా వంద మందిని నియమించుకునే అవకాశం ఉన్నదన్నారు. టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది అధికంగా ఉండే హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

సాంకేతిక, ఐటీ కార్యవర్గాన్ని మరింత విస్తరించడానికి ఈ సెంటర్ ఎంతో కీలకపాత్ర పోషించనున్నదని ఆయన చెప్పారు. 2004లో కేవలం 200 మంది సిబ్బందితో భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థ గడిచిన పదిహేనేండ్లలో 7,500 మంది సిబ్బందికి ఎదిగామన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఉన్న మూడు సెంటర్లను ఏర్పాటు చేసినట్లు, భవిష్యత్తులో మరో కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భవిష్యత్తు మార్కెట్లకు ఊతమిచ్చే విధంగా మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సాంకేతిక సేవల వ్యూహాత్మక అభివృద్ధి దిశగా సంస్థ అడుగులు వేస్తున్నదన్నారు.

...

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles