రష్యా భారీ సైనిక విన్యాసాలు!

Wed,September 12, 2018 12:22 AM

Russia launches biggest war games since Cold War

చిటా (రష్యా): వోస్టోక్-2018 పేరిట గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యంత భారీస్థాయి సైనిక విన్యాసాలను రష్యా మంగళవారం ప్రారంభించింది. వారంరోజులపాటు సాగనున్న ఈ విన్యాసాల్లో 3 లక్షల మంది సైనికులు, 36 వేల సైనిక వాహనాలు, 80 నౌకలు, 1000 హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు పాల్గొంటున్నాయి. రష్యా సైనికులతోపాటు 3500 మంది చైనా బలగాలు కూడా ఈ విన్యాసాల్లో భాగస్వాములవుతున్నాయి. మరోవైపు రష్యా తీరుపై నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ చర్య భారీ వివాదానికి సిద్ధమవుతున్నట్టుగా (రిహార్సల్) ఉన్నదని మండిపడింది.

1227
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles