మరో 9 పైసలు కోలుకున్న రూపాయి

Thu,October 11, 2018 11:42 PM

Rupee recovers after slumping to record low and up 9 paise to 74 12

ముంబై, అక్టోబర్ 11: రూపాయి విలువ గురువారం మరికొంత కోలుకున్నది. డాలర్‌తో పోల్చితే మరింతగా నిలదొక్కుకున్నది. 9 పైసలు పెరిగి 74.12 వద్ద ముగిసింది. నిజానికి ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి మధ్య ఒకానొక దశలో మునుపెన్నడూ లేని స్థాయికి క్షీణించినప్పటికీ.. చివరకు కుదురుకున్నది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరల తగ్గుదల, ఇతర దేశాల కరెన్సీ విలువల్లో పెరుగుదల రూపాయికి డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి.

ఆగని ఆర్బీఐ డాలర్ల అమ్మకాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డాలర్ల అమ్మకాలు ఆగస్టులోనూ కొనసాగాయి. 3.680 బిలియన్ డాలర్లను కొన్న ఆర్బీఐ.. 6.003 బిలియన్ డాలర్లను విక్రయించింది. అంతకుముందు జూలైలో 1.87 బిలియన్ డాలర్లను అమ్మిన ఆర్బీఐ.. జూన్, మే, ఏప్రిల్ నెలల్లోనూ సుమారు 15 బిలియన్ డాలర్లదాకా విక్రయించడం గమనార్హం. రూపాయి విలువ రికార్డు స్థాయికి క్షీణిస్తున్న క్రమంలో మన కరెన్సీకి మద్దతునిచ్చేందుకే ఆర్బీఐ తన డాలర్ నిల్వలను ఇలా అమ్మకాలతో తగ్గించుకుంటున్నది.

పతనానికి విదేశీ పరిణామాలే కారణం

దేశీయ స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువ పతనానికి విదేశీ పరిణామాలే కారణమని, తగిన సమయంలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. క్యాడ్‌ను అదుపులో ఉంచేందుకు మరిన్ని చర్యలు చేపడుతామని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి చెప్పారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles