18 పైసలు కోలుకున్న రూపాయి

Thu,October 11, 2018 02:18 AM

Rupee recovers 18 paise against US dollar

ముంబై, అక్టోబర్ 10: ఆరు రోజులుగా నష్టపోతూ వస్తున్న రూపా యి మారకం విలువ 18 పైసల మేర రికవరీ అయింది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ బలహీనపడడంతో రూపాయి మార కం విలువ 18 పైసలు పెరిగి రూ. 74.21 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో ఒకదశలో రూ.74.05 వరకూ కోలుకోగలిగింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో వచ్చిన రిలీఫ్ ర్యాలీతో కూడా కరెన్సీ మార్కెట్లో సెంటిమెంట్ బలపడింది. దీంతో చివరకి 18 పైసల రికవరీతో రూ.74.21 వద్ద ముగిసింది.

సౌదీ నుంచి అదనపు ముడిచమురు

crude-oil
దేశీయ చమురుకొనుగోలుదారులకు నవంబర్‌లో అదనంగా 40 లక్షల బ్యారెళ్ల ముడిచమురును సౌదీ అరేబియా సరఫరా చేయనుంది. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు వచ్చే నెల 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఏర్పడుతున్న లోటును భర్తీ చేసేందుకు సౌదీ అరేబియా అంగీకరించినట్టు తెలిసింది. చైనా తర్వాత ఇండియానే ఇరాన్ నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎంఆర్‌పీఎల్‌లు సౌదీ అరేబియా నుంచి పది లక్షల బ్యారెళ్ల చొప్పున అదనపు సరఫరాను కోరుతున్నాయి. అయితే ఈ విషయంపై సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు కంపెనీ ఆరామాకో స్పందించలేదు. అలాగే ఎంఆర్‌పీఎల్ ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని తెలపగా, మిగతా కంపెనీలు స్పందించలేదు. నవంబర్‌లో ఇరాన్ నుంచి 90 లక్షల బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేయడానికి గతంలో ఆర్డర్లు ఇవ్వగా ఆంక్షల నేపథ్యంలో ఈ సరఫరా నిలిచిపోనుందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది.

1354
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles