61 పైసలు కోలుకున్న రూపాయి

Thu,September 20, 2018 12:26 AM

Rupee jumps 61 paise logs best day in 18 months

ముంబై, సెప్టెంబర్ 19: డాలర్‌తో రూపాయి మారకం విలువ 61 పైసల మేర కోలుకుని రూ. 72.31 వద్ద ముగిసింది. మార్చి 2017 తర్వాత ఒక రోజులో ఇదే అతి పెద్ద రికవరీ. బ్యాంకు లు, ఎగుమతి దారులు భారీగా డాలర్లను అమ్మడంతో రూపాయి ఏడాదిన్నరలో అత్యధికంగా ఒక్కరోజులోనే రికవరీ కాగలిగిందని కరెన్సీ మార్కెట్ డీలర్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ప్రభుత్వరంగ బ్యాంకులు డాలర్లను విక్రయించాయని డీలర్లు తెలిపారు. దీంతో రూపాయి మారకం రూ. 73 స్థాయిని అధిగమిస్తుందనుకున్న అంచనాలు తప్పాయి. దీనితో తోడు క్రూడాయిల్ ధరలు మధ్యాహ్నం సెషన్లో తగ్గుముఖం పట్టడం, గ్లోబల్ మార్కెట్లన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతుండడంతో దేశీయంగా కరెన్సీ మార్కెట్ సెంటిమెంట్ కూడా పుంజుకుంది. డాలర్ ఇండెక్స్ రెండు నెలల కనీస స్థాయికి పతనం అయింది.

ఇక విదేశీ నిధుల సమీకరణ సులభం
తయారీ రంగంలోని భారతీయ కంపెనీలు విదేశాల్లో నిధులను సమీకరించేందుకు, బ్యాంకులు మసాలా బాండ్లను మార్కెట్ చేయడానికి ఉన్న నిబంధనలను మరింత సరళీకరిస్తున్నట్టు రిజర్వ్ ప్రకటించింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడంతో పాటు కరెంట్ ఖాతా లోటు ను అదుపు చేయడానికి ప్రధాని నిర్వహించిన సమీక్ష తర్వాత ప్రకటించిన చర్యలకు అనుగుణంగా రిజర్వ్‌బ్యాంక్ ఈ నిర్ణయం ప్రకటించింది. ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. 50 మిలియన్ డాలర్ల వరకూ విదేశీ వాణిజ్య రుణాలను దేశీయ ఉత్పత్తిరంగ కంపెనీలు సమీకరించవచ్చునని తెలిపింది. ఈ రుణాల కనీస కాలపరిమితిని గతంలో మూడేండ్లు ఉండగా ఇప్పుడు ఏడాదికి కుదించారు.

1034
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles