దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం


Tue,March 13, 2018 03:07 AM

ఫిబ్రవరిలో 4.44 శాతానికి తగ్గుదల

inflation.jpg
న్యూఢిల్లీ, మార్చి 12: రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఆహార పదార్థాలు, చమురు ధరలు దిగిరావడంతో గడిచిన కొన్ని నెలలుగా ఎగువముఖం పట్టిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలకుగాను 4.44 శాతంగా నమోదైంది. జనవరిలో నమోదైన 5.07 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గగా, అదే గతేడాది ఇదే నెలలో నమోదైన 3.65 శాతం పోలిస్తే మాత్రం భారీగా పెరిగినట్లు కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. నవంబర్ 2017లో ఇది 4.88 శాతంగా ఉన్నది. గతనెలలో వినియోగదారుల ఆహార పదార్థాల ధరల సూచీ 4.7 శాతం నుంచి 3.26 శాతానికి తగ్గడం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

జనవరిలో 26.97 శాతంగా ఉన్న కూరగాయల ధరల సూచీ ఆ మరుసటి నెలకుగాను 17.57 శాతానికి తగ్గగా, పండ్లు 4.80 శాతంగా నమోదయ్యాయి. వీటితోపాటు పాలు, పాల ఉత్పత్తుల సూచీ 4.21 శాతానికి పరిమితమవగా, చిరుధాన్యాలు 2.10శాతం, మాంసం-చేపలు 3.31 శాతం, కోడిగుడ్ల ధరల సూచీ 8.51 శాతానికి తగ్గాయి. చమురు, లైట్ విభాగ ఉత్పత్తుల సూచీ 6.80 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. కానీ రవాణా, కమ్యూనికేషన్స్ సేవల సూచీ మాత్రం 1.97 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగింది.

354

More News

VIRAL NEWS