భగ్గుమన్న ఆహార పదార్థాలు

Sat,April 13, 2019 02:25 AM

Retail inflation edges up to 2.86percent in March on costlier food articles

-మార్చిలో 2.86 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్వోల్బణం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఆహార పదార్థాల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గడిచిన కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉన్న ఆహార పదార్థాలు గడిచిన నెలలో భగ్గుమనడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువముఖం పట్టింది. మార్చి నెలకుగాను 2.86 శాతంగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 4.28 శాతంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గగా, ఫిబ్రవరిలో నమోదైన 2.57 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. జూలై 2018 వరకు నాలుగు శాతానికి పైగా నమోదైన ద్రవ్యోల్బణం ఆ తర్వాత ఎనిమిది నెలలుగా దిగువముఖం పట్టింది. రిజర్వు బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం కంటే తక్కువ స్థాయిలోనే నమోదైంది.

మొత్తంమీద గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం గణాంకాల సరళిని మార్చివేయడంతో సూచీ 0.3 శాతానికి చేరుకున్నది. ఫిబ్రవరిలో -0.66 శాతంగా నమోదైన ఈ సూచి ఆ మరుసటి నెలలో పుంజుకోవడం విశేషం. చమురు, లైట్ విభాగ ధరల సూచీ 2.42 శాతం వరకు పెరిగాయి. కానీ, పండ్లు, కూరగాయలు మాత్రం శాంతించాయి. పండ్ల ధరలు -5.88 శాతానికి తగ్గగా, కూరగాయలు కూడా -4.90 శాతం తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించినట్లు అయింది. చిరుధాన్యాలు మాత్రం స్వల్పంగా పెరిగి 1.25 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం 2.9 శాతం నుంచి 3 శాతం మధ్యలో నమోదవనున్నదని రిజర్వు బ్యాంక్ అంచనావేస్తున్నది. మిగతా ఆరు నెలల్లో 3.5 శాతం నుంచి 3.8 శాతానికి పెరుగనున్నదని తెలిపింది.

1963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles