నాలుగు నెలల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

Wed,June 13, 2018 12:26 AM

Retail inflation accelerates to four month high of 4 87 percent in May

మేలో 4.87 శాతంగా నమోదు
Food-inflation
న్యూఢిల్లీ, జూన్ 12: ఆహార పదార్థాలు మళ్లీ మండుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, చమురు ధరలు భగ్గుమనడంతో గడిచిన నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 4.87 శాతానికి ఎగబాకింది. ఏప్రిల్‌లో ఇది 4.58 శాతంగా ఉన్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.18 శాతం పోలిస్తే రెండు రెట్లు పెరిగిందన్న మాట. ఈ ఏడాది జనవరిలో నమోదైన 5.7 శాతం ఇప్పటి వరకు ఇదే గరిష్ఠ స్థాయి అని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌లో 2.80 శాతంగా ఉన్న కన్జ్యూమర్ ఆహార పదార్థాల ధరల సూచీ ఆ మరుసటి నెలలో 3.10 శాతానికి చేరుకున్నది. అలాగే పండ్ల ధరల సూచీ 12.33 శాతానికి పుంజుకోగా, కూరగాయల సూచీ 8.04 శాతంగాను, చిరు ధాన్యాలు 2.78 శాతంగా నమోదయ్యాయి. ఆయిల్ అండ్ ఫ్యాట్స్ ధరల సూచీ కూడా 2.11 శాతం నుంచి 2.46 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో చమురు, లైట్ విభాగ ద్రవ్యోల్బణం 5.8 శాతానికి చేరుకున్నది. కానీ ప్రొటిన్ ఆధారిత ఉత్పత్తులైన మాంసం, చేపలు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తుల ధరల సూచీ మాత్రం తగ్గుముఖం పట్టింది.

636
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles