రిలయన్స్ పవర్ నష్టం రూ.3,558 కోట్లు

Mon,June 10, 2019 12:19 AM

Reliance Power posts Rs 3,558 crore net loss in Q4

న్యూఢిల్లీ, జూన్ 9: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ రూ.3,558.51 కోట్ల నష్టం వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికిగాను సంస్థ రూ. 189.21 లాభాన్ని గడించింది. ఈ నెల 8న సమావేశమైన కంపెనీ బోర్డు గతేడాది చివరి త్రైమాసికం, మొత్తం ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలకు ఆమోదముద్ర వేసింది. వీటితోపాటు రుణాలు తగ్గించుకోవడానికి నిధుల సేకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికిగాను సంస్థ రూ.2,951.82 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2017-18లో సంస్థ రూ.840.46 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది.

776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles