జియో ఆల్-ఇన్-వన్ పథకం

Tue,October 22, 2019 12:12 AM

ముంబై, అక్టోబర్ 21: దేశీయ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో..ఆన్-ఇన్-వన్ పేరుతో ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఒకే ప్లాన్‌తో అపరిమిత సేవలతోపాటు రూ.222, రూ.333, రూ.444తో రోజుకు 2 జీబీల డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. అపరిమితమైన వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, యాప్‌లతో రోజుకు 2జీబీల డాటా లభించనున్నది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్లాన్ల కంటే 20 శాతం నుంచి 50 శాతం తక్కువకు లభిస్తున్నది. వీటితోపాటు రోజుకు 2జీబీ డాటా ప్యాక్ రూ.448 నుంచి రూ.444కి తగ్గించింది. ఈ ప్యాక్‌లో వెయ్యి నిమిషాలపాటు ఇతర నెట్‌వర్క్‌లను కాల్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే రూ.198 నెలప్యాక్ ధరను రూ.222కి పెంచింది. ఐయూసీ కాల్స్‌లో భాగంగా విధించే రూ.80 కలుపుకొని ఈ ప్యాక్ ధరను పెంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలల కాలపరిమితి కలిగిన ప్యాక్‌ను రూ.396కి బదులుగా రూ.333కి తగ్గించింది జియో. ఈ రెండు పథకాల్లో వినియోగదారులకు వెయ్యి నిమిషాలపాటు ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే అవకాశం ఉన్నది. ఈ ప్లాన్నన్నింటిలోనూ వినియోగదారులు నిత్యం 2జీబీ డాటా ఉచితంగా లభించనున్నది.

3013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles