అన్ని విధాలుగా ఆదుకుంటాం

Sun,February 17, 2019 12:37 AM

Reliance Foundation reaches out to kin of those killed in Pulwama attack

-మరణించిన జవాన్ల కుటుంబాలకు అండగా రిలయన్స్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఇటీవల మరణించిన జవాన్ల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ముఖ్యంగా ఆయా జవాన్ల పిల్లలకు చదువు, వారి కుటుబాలకు ఆర్థిక చేయూతనందిస్తామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా వద్ద తీవ్రవాదులు జరిపిన దాడిలో 40 మందికిపైగా భద్రతదళాలు మరణించిన విషయం తెలిసిందే. అమరులకు కృతజ్ఞతగా రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు వారి పిల్లల చదువులు, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. అలాగే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జవాన్లకు మెరుగైన చికిత్సను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది కూడా. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన దాతృత్వ సంస్థనే రిలయన్స్ ఫౌండేషన్.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles