రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్

Fri,August 10, 2018 12:46 AM

Reliance Digital India Sale

-11 నుంచి 15 వరకు స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్లు
ముంబై, ఆగస్టు 9: దేశీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్.. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ కొనుగోలుదారులకు గొప్ప ఆఫర్లను ప్రకటించింది. డిజిటల్ ఇండియా సేల్ పేరుతో ఈ నెల 11 (శనివారం) నుంచి 15 వరకు ఈ రాయితీ మేళాను ముందుకు తెచ్చింది. ఇందులో భాగంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సిటీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ వంటి అన్ని ప్రధాన డెబిట్, క్రెడిట్ కార్డులపై జరిపే కొనుగోళ్లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇచ్చింది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా రిలయన్స్ గురువారం ఓ ప్రకటనలో చెప్పింది. ల్యాప్‌టాప్‌లపైనా ఆకర్షణీయమైన ఆఫర్లున్నాయని తెలిపింది.

1725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles