రిఫైన్డ్ వంటనూనెలపై అపోహలు వద్దు

Wed,January 9, 2019 12:19 AM

Refined oils are totally safe for cooking

హైదరాబాద్, జనవరి 8: రిఫైన్డ్ వంటనూనెల వినియోగంపై సోషల్ మీడియా వెల్లువెత్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇండియన్ కన్జ్యూమర్ ఫెడరేషన్ (ఐసీఎఫ్) తెలిపింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా వంటనూనెలపై అవగాహన సదస్సును నిర్వహించారు. వినియోగదారులు వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, ఆవ, కుసుమ నూనెలలను రిఫైనింగ్ చేయని వాటిని కూడా ఉపయోగించవచ్చుననీ, అయితే అవి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి పొందినవా లేవా అనే అంశాన్ని పరిశీలించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ సైంటిఫిక్ ప్యానెల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అన్నారు. మిగతా వంటనూనెల రిఫైనింగ్ వల్ల వాటిలోని కల్మషాలు మాత్రమే వెలికితీయడం జరుగుతుందని, రుచికరంగా, నిల్వ చేసినప్పటకి ఈ గడ్డకట్టుకుపోని విధంగా ఉండేందుకే వాటిని రిఫైనింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మున్సిపల్ మంచినీటితో సహా పాలు కూడా ఏదో రూపంలో రిఫైనింగ్ అయి వస్తున్న వాటినే మనం నిత్య జీవితంలో వినియోగిస్తున్నామనీ, రిఫైన్డ్ వంటనూనెల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ న్యూట్రిషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కల్పగం పోలాస, సాల్వెంట్ ఎక్స్‌టాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీపీ మెహతా తదితరులు పాల్గొన్నారు.

1493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles