కోల్ ఇండియాలో తగ్గిన ప్రభుత్వ వాటా

Tue,March 26, 2019 12:15 AM

Reduced government share in Coal India

కోల్‌కతా, మార్చి 25: ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియాలో ప్రభుత్వ వాటా మరింత తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థలో కేంద్రం వాటా 72.33 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఇది 78.5 శాతంగా ఉన్నది. ఇటీవల 0.72 శాతానికి సమానమైన షేర్లను తిరిగి కొనుగోలు చేయడంతో 72.33 శాతానికి చేరుకున్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. మరోవైపు సంస్థలో ఎఫ్‌ఐలు 18.63 శాతం వాటా కలిగివుండగా, ఎఫ్‌ఐఐలకు 6.3 శాతం, ప్రజలకు 2.74 శాతం వాటా ఉన్నది. 2018-19లో సంస్థ ప్రకటించిన రెండుసార్లు డివిడెండ్, పబ్లిక్ ఆఫర్, ఈటీఎఫ్‌ఎస్‌ల రూపంలో వాటాను విక్రయించడంతో కేంద్రానికి రూ.18 వేల కోట్ల వరకు నిధులు సమకూరాయి. అంతక్రితం ఏడాది కేంద్రానికి పది వేల కోట్ల రూపాయలు సమకూరాయి.

294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles