నెహాల్ మోదీపై రెడ్‌కార్నర్

Sat,September 14, 2019 03:06 AM

Redcorner on Nehal Modi

-నోటీసు పీఎన్‌బీ స్కాంలో జారీ చేసిన ఇంటర్‌పోల్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ని మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తమ్ముడు నెహాల్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది ఇంటర్‌పోల్. ఈ విషయాన్ని ఇంటర్‌పోల్ అధికారులు వెల్లడించారు. 40 ఏండ్ల వయ స్సు కలిగిన నెహాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్(ఈడీ) మనీ లాండరింగ్ చట్టం కింద దాఖలు చేసిన కేసు ఆధారంగా అంతర్జాతీయంగా అరెస్ట్ చేయడంలో భాగంగా ఇంటర్‌పోల్ ఈ రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేసింది. మార్చి 3, 1979లో బెల్జియంలో జన్మించిన నెహాల్ దీపక్ మోదీకు ఇంగ్లీష్, గుజరాతి, హిందీ మాట్లాడగలడని అంతర్జాతీయ పోలీసులు వెల్లడించారు. ఇంటర్‌పోల్‌లో సభ్యత్వం కలిగిన 192 దేశాల్లో ఎక్కడ ఉన్న నెహాల్‌ను అరెస్ట్ చేయడానికి వీలు పడనున్నది. పీఎన్‌బీని మోసం చేసిన కేసులో ఈడీ..నీరవ్ మోదీతోపాటు ఆయన తమ్ముడు నెహాల్ మోదీనికి కూడా చార్జిషీట్‌లో పొందుపరిచింది. పీఎన్‌బీని మోసం చేసిన తర్వాత నీరవ్ మోదీ దగ్గరి స్నేహితుడు మిహిర్ ఆర్ భన్సాలీ..50 కిలోల బంగారం, కొంత మొత్తంలో నగదు ను దుబాయి నుంచి ఇతర దేశాలకు తరలించారని ఈడీ ఆరోపిస్తున్నది.

190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles