భారత్‌లో రియల్‌మీ పరిశోధన కేంద్రం!

Tue,June 11, 2019 12:23 AM

Realme to set up exclusive R and D facility in India

హైదరాబాద్, జూన్ 10: భారత్‌లో పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాయి చైనాకు చెందిన మరో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ. ఇప్పటికే ఒప్పో, వన్‌ప్లస్, రెడ్మీలు ఇక్కడ ఆర్‌అండ్ డీ సెంటర్లను ఏర్పాటు చేయగా..తాజాగా రియల్‌మీ కూడా ఇక్కడే కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సంకేతాలిచ్చింది. దేశీయ మొబైల్ వినియోగదారుల అవసరాల నిమిత్తం ఇక్కడే పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మాధవ్ షేత్ తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేసేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రాష్ట్రమార్కెట్లోకి రూ.5,999 ధర కలిగిన రియల్‌మీ సీ2 మొబైల్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సంస్థ నాలుగు రకాలకు చెందిన ఎనిమిది మొబైళ్లను దేశీయంగా విక్రయిస్తున్నదని, వచ్చే నెలలో ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన ఎక్స్ సిరీస్ మొబైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాదికాలంలోనే 80 లక్షల మొబైళ్లను విక్రయించిన సంస్థ..వచ్చే ఏడాది 1.5 కోట్ల మొబైళ్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 6.1 అంగుళాల తాకేతెర కలిగిన ఈ సీ2 మొబైల్లో 2జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ(256 జీబీ వరకు పెంచుకోవచ్చును), 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles