రియల్‌మీ సరికొత్త ఫోన్

Sat,September 14, 2019 03:16 AM

Realme launches its first 64MP quad camera phone at Rs 15999

గరిష్ఠ ధర రూ.18,999
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: చైనాకు చెందిన ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ రియల్..ప్రీమియం మోడళ్ల విభాగంలోకి అడుగుపెట్టింది. రియల్‌మీ ఎక్స్‌టీ పేరుతో విడుదల చేసిన ఈ మోడళ్లు రూ.15,999 మొదలుకొని రూ.18,999 మధ్యలో లభించనున్నాయి. వీటి ఇంటర్నల్ మెమొరీ స్టోరేజీ 64జీబీ నుంచి 128 జీబీ వరకు ఉన్నది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా హెడ్ మాధవ్ సేథ్ మాట్లాడుతూ..ప్రస్తుత సంవత్సరంలో దేశీయంగా 1.5-2 కోట్ల స్థాయిలో మొబైళ్లను విక్రయించాలనుకుంటున్నట్లు, దీంతో మొబైల్ మార్కెట్లో మూడోస్థానానికి చేరుకోవడానికి వీలుంటుందన్నారు.

దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాదికాలంలో కంపెనీ మొబైళ్లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని చెప్పారు. వచ్చే పండుగ సీజన్‌లో అమ్మకాలు అధికంగా ఉంటాయన్న అంచనాతో రూ.300 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఎనిమిది అసెంబ్లింగ్ లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకు 15 లక్షల మొబైళ్లను ఉత్పత్తి చేస్తున్న సంస్థ..ఈ నూతన ఆరు లైన్లు అందుబాటులోకి రానుండటంతో మొత్తం ఉత్పత్తి రెండింతలు 30 లక్షలకు చేరుకోనున్నది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికి షియోమీ 28 శాతం మార్కెట్ వాటాతో తొలిస్థానంలో ఉండగా, సామ్‌సంగ్ 25 శాతంతో రెండో స్థానంలోనూ, వివో 11 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles