8 లక్షల కోట్ల ఎన్‌పీఏలపై దివాలా చట్టం ప్రకారం చర్యలు


Mon,July 17, 2017 12:33 AM

మార్చి 2019కల్లా ఆర్‌బీఐ ప్రతిపాదించవచ్చన్న అసోచామ్
NonPerforming
న్యూఢిల్లీ, జూలై 16: వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా (మార్చి 2019) ఆర్‌బీఐ రూ.8 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలపై (ఎన్‌పీఏ) దివాలా చట్టం ప్రకారంగా చర్యలకు ఆదేశించవచ్చని అసోచామ్ అంటున్నది. తద్వారా బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు భారీగా తగ్గుముఖం పట్టడంతోపాటు బ్యాంకుల ఆస్తుల నాణ్యత గణనీయంగా పెరుగుతుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికల్లా మొండిబకాయిల సమస్యకు తెరపడుతుందని ఆశించవచ్చని రిపోర్టులో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతోపాటు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ చేపట్టే చర్యలు ఇందుకు దోహదపడనున్నాయని అసోచామ్ అంటున్నది. అన్ని ఎన్‌పీఏలపైనా దివాలా కోడ్ ప్రకారంగా చర్యలు చేపట్టినప్పటికీ అందులో ఎన్ని బకాయిలు, ఎంత త్వరగా రికవరీ అవుతాయన్న అంశాలను పరిశీలించాల్సి ఉందని రిపోర్టులో పేర్కొంది.

బ్యాంకింగ్ రంగంలో ఆందోళనకర స్థాయికి చేరుకున్న ఎన్‌పీఏలను పరిష్కరించేందుకు ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఈమధ్యే ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో బడా మొత్తాల్లో రుణం చెల్లించాల్సిన వారిపై దివాలా చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించే అధికారం ఆర్‌బీఐకి సంక్రమించింది. రూ. 5వేల కోట్ల కంటే అధిక మొత్తంలో బకాయిపడిన 12 ఎన్‌పీఏ ఖాతాలపై దివాలా కోడ్‌ను ప్రయోగించాలని ఆర్‌బీఐ ఈమధ్యే బ్యాంకులను ఆదేశించింది. ఈ 12 ఎన్‌పీఏ ఖాతాల బకాయిల విలువే రూ.2 లక్షల కోట్లు. అంటే మొత్తం రూ.8 లక్షల ఎన్‌పీఏల్లో ఈ డజను ఖాతాల వాటానే 25 శాతం.

170

More News

VIRAL NEWS