కరెన్సీ గుర్తింపునకు మొబైల్ యాప్

Mon,May 13, 2019 12:05 AM

RBI proposes mobile app to help visually impaired to identify currency notes

- దృష్టి లోపాలున్నవారి కోసం ఆర్బీఐ ప్రతిపాదన
న్యూఢిల్లీ, మే 12: దృష్టి లోపాలున్నవారు కరెన్సీ నోట్లను సరిగ్గా గుర్తించేలా ఓ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.10, 20, 50, 100, 200, 500, 2,000 నోట్లు చలామణిలో ఉన్న విషయం తెలిసిందే. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం జారీచేసే రూ.1 నోటూ ఉన్నది. అయితే పాత నోట్లకుతోడు కొత్త కరెన్సీ నోట్లు పరిచయం అవుతుండటంతో అంధులకు, ఇతరత్రా కంటి చూపు సమస్యలను ఎదుర్కొంటున్నవారికి సాయంగా మొబైల్ అప్లికేషన్ ప్రాధాన్యతను ఆర్బీఐ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ యాప్ అభివృద్ధి కోసం టెక్నాలజీ సంస్థల నుంచి బిడ్లనూ ఆహ్వానించింది. నిజానికి రూ.100 అంతకుమించిన విలువైన నోట్ల గుర్తింపు కోసం ఇంటాగ్లియో ప్రింటింగ్ ఆధారిత గుర్తింపు చిహ్నాలను (నోటు చివర లైన్లు) కరెన్సీలపై ఆర్బీఐ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ మొబైల్ యాప్‌ను తేవాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. గతేడాది మార్చి 31 నాటికి చలామణిలో దాదాపు 102 బిలియన్ల నోట్లున్నాయి. వీటి విలువ రూ.18 లక్షల కోట్లు. ఇక దేశంలో సుమారు 80 లక్షల మంది అంధులు, దృష్టి లోపాలున్నవారున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్బీఐ ప్రతిపాదన ఫలించి మొబైల్ యాప్ వస్తే వీరందరికీ ప్రయోజనం చేకూరనున్నది.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles