నేడే ఆర్బీఐ పరపతి సమీక్ష

Thu,December 5, 2019 12:28 AM

-వడ్డీరేట్లు మరో పావు శాతం తగ్గించే అవకాశం

ముంబై, డిసెంబర్ 4: రిజర్వు బ్యాంక్ మరోదఫా వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ 26 త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి పడిపోయిన నేపథ్యంలో గురువారం ప్రకటించనున్న పరపతి సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను మరో పావు శాతం కోత విధించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఒకవేళ తగ్గిస్తే ప్రస్తుత సంవత్సరంలో వడ్డీరేట్లును తగ్గించడం ఇది ఆరోసారి కానున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ వడ్డీరేట్లను 135 బేసిస్ పాయింట్లను తగ్గించగా..బ్యాంకులు మాత్రం 29 బేసిస్ పాయింట్లు తగ్గించి చేతులు దులుపుకున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు పెట్టుబడులకు ఉత్సాహాన్ని ఇచ్చాయని, ముఖ్యంగా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత సరళతరం చేయడం, నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం ప్రత్యేక ప్యాకేజీ వంటి నిర్ణయాలు వృద్ధికి ఊతమివ్వనున్నాయన్నారు.

179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles