పెద్ద నోట్ల రద్దు దండుగ

Tue,March 12, 2019 12:06 AM

-దేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
-నల్లధనాన్ని నిర్మూలించబోదు
-ముందే మోదీకి చెప్పిన ఆర్బీఐ బోర్డు
-ఆర్టీఐ సమాధానంలో రిజర్వ్ బ్యాంక్ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 11: పాత పెద్ద నోట్ల రద్దు.. కేంద్రం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణ యం ప్రభావం ఇప్పటికీ అటు దేశ ఆర్థిక వ్యవస్థపై, ఇటు ప్రజలపై చూపుతున్న విష యం తెలిసిందే. నల్లధనం నిర్మూలనే ధ్యేయంగా 2016, నవంబర్ 8వ తేదీ రాత్రి రూ.500, 1,000 నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అనూహ్య నిర్ణయంతో దేశం యావత్తూ ఒక్కసారి ఉలిక్కిపడగా, తదనంతర పరిణామాలు సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తే.. వ్యాపార, ఆర్థిక రంగాల వృద్ధిని అడ్డుకున్నాయి. చివరకు ఏ నల్లధనాన్ని నిర్మూలించాలని పాత పెద్ద నోట్లను రద్దు చేశారో.. ఆ లక్ష్యం కూడా నెరవేరలేదు. అయితే ఇలా జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డు డైరెక్టర్లు ముందే ఊహించారు. ఆ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా చెప్పారు. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు జాతినుద్దేశించి ప్రధాని నాటి రాత్రి 8 గంటలకు ప్రకటించగా, అందుకు రెండున్నర గంటల ముందు సాయంత్రం 5:30 గంటలకే అంతా వివరించారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త వెంకటేష్ నాయక్ దాఖలు చేసిన పిటీషన్‌కు ఆర్బీఐ తాజాగా తెలియజేసింది.

నాటి బోర్డులో దాస్ కూడా..


కేంద్రం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ఆమోదం తెలిపేందుకు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశం జరుగగా, ఇందులో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌తోపాటు నాటి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, నేటి ఆర్బీఐ గవర్నరైన శక్తికాంత దాస్ కూడా ఉండటం గమనార్హం. వీరితోపాటు అప్పటి ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఆర్ గాంధీ, ఎస్‌ఎస్ ముంద్రాలున్నారు. ప్రస్తుత బోర్డులో గాంధీ, ముంద్రాలు లేని విషయం తెలిసిందే. ఇక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ-ఆర్బీఐ విభేదాల మధ్య గవర్నర్ పదవికి పటేల్ రాజీనామా చేయడంతో గతేడాది డిసెంబర్‌లో దాస్‌కు ఆర్బీఐ సారథ్య బాధ్యతల్ని అప్పగించిన సంగతీ విదితమే.

మోదీ సర్కారు ఒంటెత్తు పోకడ: కాంగ్రెస్


పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ సరికాదన్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా అమలు చేసిందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఈ విషయంలో ఆర్బీఐ ప్రభుత్వ వాదనల్ని విన్నదే తప్ప.. గట్టిగా వ్యతిరేకించలేకపోయిందని కూడా ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుకు ముందు జరిగిన ఆర్బీఐ బోర్డు చివరి సమావేశం వివరాలను 28 నెలల తర్వాత వెల్లడించారన్నారు. ఆర్టీఐ కార్యకర్త ఎప్పుడో పిటీషన్ వేస్తే.. ఇన్నాళ్లకు వివరాల్ని వెల్లడిస్తారా? అని దుయ్యబట్టారు.

ఆర్బీఐ బోర్డు ఏం చెప్పింది?


పాత పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుందని, వృద్ధిరేటు మందగిస్తుందని కేంద్రానికి ఆర్బీఐ బోర్డు స్పష్టం చేసింది. జీడీపీపై స్వల్పకాలిక ప్రతికూల ప్ర భావం పడుతుందని, ముఖ్యంగా వ్యాపార, ఆర్థిక రంగాలు కుంటుబడుతాయని పేర్కొన్నది. అన్నిటికన్నా నల్లధనం నిర్మూలన అన్నది వట్టి మాటగానే మిగులుతుందని హెచ్చరించింది. నిజానికి నల్లధనం నగదు రూపంలో లేదని.. బంగారం, రియల్ ఎస్టేట్ ఆస్తుల్లోనే దాగుందని మెజారిటీ ఆర్బీఐ డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే పాత పెద్ద నోట్ల రద్దు దండుగ పనిగా తేల్చిచెప్పింది. అయినప్పటికీ ద్రవ్య వ్యవస్థలో 86 శాతంగా ఉన్న రూ.500, 1,000 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తగా రూ.500, 2,000 నోట్లను మోదీ పరిచయం చేశారు. నోట్ల రద్దు సమయంలో చలామణిలో రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, 1,000 నోట్లున్నాయి. వీటిని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసి, కొత్త నోట్లను తీసుకోగా, తిరిగి వచ్చిన నోట్ల విలువ రూ.15.31 లక్షల కోట్లుగా ఉందని ఆర్బీఐ అనంతరం తెలియజేసిన విషయం తెలిసిందే. కేవలం రూ.10,720 కోట్లు మా త్రమే తిరిగి రాలేదన్నది. దీంతో నోట్ల రద్దు విఫలమని చెప్పకనే చెప్పినైట్లెంది.

3480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles